
సాక్షి,నంద్యాల: రాష్ట్రంలో పచ్చమూకల అరాచకాలు కొనసాగుతున్నాయి. తాజాగా, నంద్యాల జిల్లా కలుగోట్లలో మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి అనుచరులు రాడ్లతో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం కోవలెకుంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రెండురోజుల క్రితం కూడా వైఎస్సార్‌సీపీ నేత రామసుబ్బారెడ్డిపై అదే వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు నంద్యాల జిల్లాలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
స్థానికంగా ‘పచ్చమూకల అరాచకాలు’అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ.. రాజకీయంగా ప్రేరితమైన ఈ దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.