Evening Top 10 Telugu News: తెలుగు తాజా వార్తలు 10

Latest Telugu News Telugu Breaking News Telugu Varthalu 24th July 2022 - Sakshi

1. మంకీపాక్స్‌పై కేంద్రం అలర్ట్.. ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమావేశం
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. దీనిపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జరనల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరిగింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్‌: జైరాం రమేశ్
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌. బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా.. శనివారం ఓ జాతీయ ఛానల్‌లో మాట్లాడుతూ సోనియా గాంధీపై పరుషపదజాలన్ని ఉపయోగించడంపై మండిపడ్డారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. నీరజ్‌ చోప్రాకు సీఎం జగన్‌ అభినందనలు
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌-2022లో అద్వితీయ ప్రదర్శన కనబరిచి సిల్వర్‌ మెడల్‌ సాధించిన భారత జావెలిన్‌ స్టార్‌, ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ నీరజ్‌ చోప్రాకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు  
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్‌ నోయువర్‌ కస్టమర్‌) తప్పని సరి అయింది. ఈ ఏడాది పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద కేంద్ర ప్రభుత్వం అందజేసే రూ.2వేల చొప్పున ఏటా రూ.6వేలు జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ‘అప్పుడు అవహేళన చేశారు.. ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు’
సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో నెల్లూరు కస్తూరిబా కళాక్షేత్రంలో ‘థ్యాంక్యూ సీఎం సార్‌’ ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఒప్పందం చేసుకున్న మరుసటి రోజే ఒడెస్సా పోర్ట్‌పై రష్యా దాడులు
ఆహార సంక్షోభాన్ని అడ్డుకునేందుకు నల్ల సముద్రం మీదుగా ఆహార ధాన్యాలను చేరవేసేలా రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అయితే.. ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఆ మరుసటి రోజే ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టుపై రష్యా క్షిపణులు విరుచుకుపడ్డాయి. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. మగ బిడ్డకు జన్మనిచ్చిన కృనాల్‌ పాండ్యా భార్య పంఖురి శర్మ
టీమిండియా ఆల్‌రౌండర్‌, హార్ధిక్‌ పాండ్యా సోదరుడు కృనాల్‌ పాండ్యా తండ్రి అయ్యాడు. కృనాల్‌ భార్య పంఖురి శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కృనాల్‌ ఇవాళ (జులై 24) మధ్యాహ్నం ట్విటర్‌ వేదికగా రివీల్‌ చేశాడు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. నగ్నంగా రణ్‌వీర్‌ సింగ్‌.. మానసిక రోగి అంటూ బ్యానర్లు
బాలీవుడ్ యంగ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) సినిమాల మాట ఎలా ఉన్నా తన డ్రెస్సింగ్‌ స్టైల్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పటికే అతను వేసుకున్న డ్రెస్‌లపై నెటిజన్లు ఘోరమైన కామెంట్లు మీమ్స్ చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ప్రమాద ఘటనలో కుట్ర కోణం.. పోలీసులను ప్లాన్‌ ప్రకారమే చంపేశారా?
పూతలపట్టు మండలం పి.కొత్తపేట రైల్వే అండర్‌ బిడ్జి వద్ద జరిగిన ప్రమాద ఘటనలో కుట్ర కోణం ఉందా?. స్కెచ్‌ ప్రకారం డ్రగ్స్‌ నిందితులే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఎస్‌ఐ అవినాష్‌, కానిస్టేబుల్‌ అనిల్‌, డ్రైవర్‌ మృతిచెందిన సంగతి తెలిసిందే.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు వింత పెళ్లి సంప్రదాయాలు మీకోసం..
అయ్యో.. తప్పుగా అనుకోకండి. దక్షిణ కొరియాలోని పెళ్లి కొడుక్కి తప్పకుండా చేయాల్సిన మర్యాద ఇది. అంటే వధువు చెప్పుతో వరుడిని కొట్టడం కాదండీ! కట్టుకున్న భార్యను తనతోపాటు తీసుకెళ్లాలంటే వరుడు తన కాళ్లకున్న చెప్పులు తీసి.. అతని కుటుంబమో.. లేక అతని స్నేహితులతోనో తన అరికాళ్ల మీద కొట్టించుకోవాలి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top