AP CM YS Jagan Congratulations To Champion Neeraj Chopra - Sakshi
Sakshi News home page

నీరజ్‌ చోప్రాకు సీఎం జగన్‌ అభినందనలు

Jul 24 2022 1:18 PM | Updated on Jul 24 2022 3:07 PM

Congratulations to champion Neeraj Chopra CM YS Jagan - Sakshi

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌-2022లో అద్వితీయ ప్రదర్శన కనబరిచి సిల్వర్‌ మెడల్‌ సాధించిన భారత జావెలిన్‌ స్టార్‌, ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ నీరజ్‌ చోప్రాకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ‘వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన సుబేదార్‌ నీరజ్‌ చోప్రాకు అభినందనలు. చాంపియన్‌ నీరజ్‌ చోప్రా మరోసారి భారతదేశ కీర్తిని ఇనుమడింప చేశాడు’అని సీఎం జగన్‌ ట్విట్టర్‌లో కొనియాడారు.

కాగా, అమెరికాలోని యుజీన్‌లో వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఫైనల్‌లో నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం జావెలిన్‌ను  విసిరిన నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. 

Advertisement
 
Advertisement
Advertisement