చంద్రబాబే ఓ రాజకీయ భిక్షగాడు | Kodali Nani Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబే ఓ రాజకీయ భిక్షగాడు

Sep 5 2020 5:25 AM | Updated on Sep 5 2020 9:46 AM

Kodali Nani Fires On Chandrababu Naidu - Sakshi

మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని, పక్కన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

సాక్షి, అమరావతి: ‘రైతుద్రోహి చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హతే లేదు. చంద్రబాబు ఓ రాజకీయ భిక్షగాడు, ఒక దళారీ. హెరిటేజ్‌ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరకు పంటలు కొని, ఎక్కువకు అమ్ముకుంటున్న బ్రోకర్‌..’ అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, వల్లభనేని వంశీలతో కలసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

► రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్‌ అందేలా చేయడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష  
► రైతులు వాడుకున్న విద్యుత్‌కు పైసా భారం పడకుండా ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది.  
► దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్‌ పది కాలాల పాటు ఉండాలనేదే సీఎం జగన్‌ నిర్ణయం.  
► ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం వ్యవస్థీకృతం చేస్తుంటే టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోంది.   
► నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్, వైఎస్సార్‌ కుటుంబాలు. అచ్చెన్నాయుడిని హింసించారంటున్నారే.. అలాగైతే పైల్స్‌ ఆపరేషన్‌కు ఎవరైనా 70 రోజులు ఆసుపత్రిలో ఉంటారా? మామను చంపి.. చంద్రబాబు, వదినను చంపి.. దేవినేని ఉమా రాజకీయాల్లోకి వచ్చారు.    
► ‘నేను క్వారీల పేరుతో అక్రమాలు చేసినట్లు చెబుతున్న దేవినేని ఉమా ఆరోపణలపై సీబీఐ విచారణకు  సిద్ధం. అలాగే మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఇరిగేషన్‌ పనుల్లో అవినీతిపై దేవినేని ఉమా సీబీఐ విచారణకు సిద్ధమా?’ అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ సవాల్‌ విసిరారు. దేవినేని ఉమా తండ్రి పేరుతో కొండపల్లి గుట్టల్లో క్వారీ ఉందని, త్వరలో దీని వివరాలు బయట పెడతానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement