దేశ భవిష్యత్తు కాళీ మాత చేతిలోనే: కేతిరెడ్డి

Kethireddy Wishes Mamata Banerjee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బెంగాల్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మమతా బెనర్జీకి సినీ నిర్మాత, ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మాజీ సభ్యులు కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో మమత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మమత నిన్నటి వరకు కలకత్తాలో కాళీ అవతారాన్ని చూశామని రాబోయే  రోజుల్లో భారత్‌కు కాళీ మాత అవసరముందనీ కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు.

1990లో యువజన కాంగ్రెస్ లో మమతతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు.  అప్పటి నుంచి ఇప్పటి వరకు దీదీ అదే స్పీడ్‌ను కల్గి ఉందన్నారు. మమత బెనర్జీ ‘భారత విప్లవ సింహం’ అని  వర్ణించవచ్చునని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో వారి నాయకత్వం దేశానికి చాలా అవసరముందని కేతిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు దృష్టి మమతా బెనర్జీపైనే ఉందని తెలిపారు.

కాగా నేడు ప్రమాణస్వీకారం చేసిన నూతన ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ కు కేతిరెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ..‘ స్టాలిన్‌  తన పాలనతో తమిళనాడులో నూతన అధ్యయాన్ని లిఖించాలి. దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా వెలుగొంది, వారి తండ్రి కరుణానిధి ఆశయాలను, ప్రజల లక్ష్యాలను తీర్చుతూ..వారి పాలన సాగాల’ని పేర్కొన్నారు. వారి అడుగుజాడల్లో తాము నడుస్తామని కేతిరెడ్డి ప్రమాణం చేశారు.

చదవండి: తమిళనాడు నూతన సీఎంగా ఎం.కే స్టాలిన్‌: కేతిరెడ్డి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top