ఉద్యోగుల్ని రాజకీయంగా వాడుకున్నదే చంద్రబాబు: వెంకట్రామిరెడ్డి | K Venkatarami Reddy Slams Chandrababu Over His Dismiss Row | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల్ని రాజకీయంగా వాడుకున్నదే చంద్రబాబు: వెంకట్రామిరెడ్డి

Apr 21 2026 11:31 AM | Updated on Apr 21 2026 1:02 PM

K Venkatarami Reddy Slams Chandrababu Over His Dismiss Row

సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయంగా వాడుకున్న చరిత్ర చంద్రబాబుదేనని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. తనను అన్యాయంగా విధుల నుంచి తొలగించారంటూ ఆయన మంగళవారం మీడియా ద్వారా మాట్లాడారు. 

పచ్చ మీడియా జర్నలిస్టులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేను ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయలేదని గతంలో అధికారులు రిపోర్ట్‌ ఇచ్చారు. నా డిస్మిస్‌ తప్పని ప్రతీ ఐఏఎస్‌కు తెలుసు. నన్ను డిస్మిస్‌ చేసింది కేవలం ఉద్యోగులను భయపెట్టడానికే.  కానీ, కూటమి ప్రభుత్వ బెదిరింపులకు ఉద్యోగులు భయపడరు. ఉద్యోగులను రాజకీయంగా వాడుకుందే చంద్రబాబు. గతంలో ఏపీ ఉద్యోగులను తీసుకెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేయించారు. ఆ సమయంలో ఉద్యోగుల చేత ప్రధాని మోదీని చంద్రబాబు తిట్టించారు. 

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగుల కోసం ఇచ్చిన హామీలేమయ్యాయి?. ఎప్పుడు అమలు చేస్తారు??.. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏం చేసింది??. ఈ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 15వ తేదీ పైనే జీతాలు పడుతున్నాయి.. 

.. ఉద్యోగులకు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చారు.  ఉద్యోగులపట్ల వైఎస్‌ జగన్‌ చాలా హుందాగా వ్యవహరించారు. ఉద్యోగులకు చాలా రకాలుగా మేలు చేశారు. కూటమి ప్రభుత్వం కంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 100 రెట్లు మేలు అని వెంకట్రామిరెడ్డి అన్నారు. 

పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో అసిస్టెంట్‌ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న వెంకట్రామిరెడ్డిని  ఉద్యోగం నుంచి తొలగిస్తూ సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వైఎస్సార్‌సీపీకి ఆయన అనుబంధంగా పని చేశారని.. ఎన్నికల సమయంలోనూ పార్టీ కోసం ప్రచారం చేశారని.. తద్వారా సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనపై చర్యలు తీసుకున్నట్లు సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. 

నన్ను డిస్మిస్ చేసినంత మాత్రాన నేను భయపడే ప్రసక్తే లేదు

Advertisement
 
Advertisement
Advertisement