నన్ను చెప్పనిస్తే ఉంటా.. లేదంటే వెళ్తా: జానారెడ్డి

Jana Reddy Irritate At Congress Party Political Affairs Committee Meeting - Sakshi

కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో జానారెడ్డి అసహనం

ఓటమికి సమిష్టి బాధ్యత ఉంటుంది

సాక్షి, హైదరాబాద్ : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు పెట్టింది. టీపీసీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు సీనియర్లు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితంపై చర్చించేందుకుగాను బుధవాంర గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. నాలుగు గంటలకు పైగా సమావేశం కొనసాగింది.

ఈ సందర్భంగా ఎన్నికల్లో ఓటమికి నేనే బాధ్యత వహిస్తా అంటూ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జానారెడ్డి తప్పు పట్టారు. ‘‘నువ్వు ఒక్కడివే బాధ్యుడివి ఎలా అవుతావు’’ అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ‘‘నేను చెప్పేది చెప్పనిస్తే ఉంటా... లేదంటే సంతకం పెట్టి వెళ్ళిపోతా’’నంటూ జానారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 
(చదవండి: Congress Party: ‘హుజురాబాద్‌’ ఫలితం.. 60 వేల నుంచి 3 వేలకు..)

ఓటమికి సమిష్టి బాధ్యత ఉంటుంది కానీ.. ఒక్కడి బాధ్యతే ఉండదన్నారు జానారెడ్డి. రేణుకా చౌదరి జానారెడ్డి వ్యాఖ్యలకు మద్దతు పలికారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీది బ్యాడ్ షో అని ఉత్తమ్, వీహెచ్‌, మదు యాష్కీ తెలిపారు. ఇప్పటికే మళ్లీ మీడియాతో మాట్లాడను అని జగ్గారెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. 
చదవండి: ఈ రోజు లాస్ట్ మీటింగ్‌.. గాంధీ భవన్‌లో మాట్లాడాలా వద్దా అనేది తేల్చుకుంటా

ఓటమి కి గల కారణాలు తెలుసుకునేందుకు కమిటీ వేస్తాం: షబ్బీర్‌ అలీ
రెండు రోజుల పాటు మెంబర్ షిప్ డ్రైవ్‌పై శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తాం.. నవంబర్ 14 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా  సీనియర్ లీడర్ల పాదయాత్ర చేస్తారని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి గల కారణాలను సమీక్షించుకున్నాం. హుజూరాబాద్ ఎన్నిక పార్టీల మధ్య జరగలేదు.కేసీఆర్, ఈటల మధ్య జరిగిన ఫైట్ అన్నారు. 

‘‘టీఆర్ఎస్, బీజేపీలు 6 నుంచి 10 వేలు పెట్టి ఓక్కో ఓటు కొన్నారు. ఈటల రాజెందర్ ఎక్కడ తాను బీజేపీ అని చెప్పలేదు. ఓటమి కి గల కారణాలు తెలుసుకునేందుకు ఓ కమిటీ వేస్తాం’’ అని షబ్బీర్‌ అలీ తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top