Gujarat Assembly Election 2022: మోదీ నుంచి మోర్బీ వరకు...

Gujarat Assembly Election 2022: Key factors influencing Gujarat elections - Sakshi

గుజరాత్‌ ఎన్నికలపై ప్రభావం చూపించే కీలక అంశాలివే..  

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. తొలిసారిగా ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగుతూ ఉండడంతో ప్రతీ అంశమూ ఎన్నికల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా అధికార బీజేపీ ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధిక ధరలు, నిరుద్యోగం దగ్గర్నుంచి ఇటీవల జరిగిన మోర్బీ కేబుల్‌ వంతెన దుర్ఘటన వరకు ఎన్నో అంశాలు ఈ ఎన్నికలపై ప్రభావాన్ని చూపించనున్నాయి. అవేంటో చూద్దాం..  

అధికార వ్యతిరేకత
రాష్ట్రంలో 1998 నుంచి అంటే 24 ఏళ్లుగా కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వంపై అధికార వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వంపై వివిధ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగం, తడిసిమోపెడైన జీవన వ్యయం, నాసిరకమైన రోడ్లు, విద్య, ఆరోగ్య రంగాల్లో నాణ్యతా ప్రమాణాలు పడిపోవడం వంటివన్నీ ఈ సారి ఎన్నికల్లో ఓటర్లపై పడనున్నాయి. రాష్ట్ర ప్రజలు మార్పుని కోరుకుంటున్నారనే విశ్లేషణలు వినబడుతున్నాయి.  

మోదీ ఇమేజ్‌
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌ ఈ ఎన్నికల్లో అత్యంత కీలక అంశం కానుంది. మోదీ రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఎనిమిదేళ్లవుతున్నప్పటికీ ప్రజల్లో ఆయనకున్న ఛరిష్మా తగ్గలేదు. 2001 నుంచి 2014 వరకు ఆయన రాష్ట్రాన్ని నడిపించిన తీరు, అంతర్జాతీయంగా మోదీకి ఉన్న పేరు ప్రతిష్టలు గుజరాత్‌ ఎన్నికలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ గుజరాత్‌ మనం తయారు చేసుకున్నదే అంటూ మోదీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గుజరాత్‌ మోడల్‌నే అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని చెబుతూ ఉండడం గమనార్హం.

బిల్కిస్‌ బానో దోషుల విడుదల
గుజరాత్‌ మత ఘర్షణల సమయంలో జరిగిన బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ దోషులను శిక్షా కాలం కంటే ముందుగానే విడిచిపెట్టడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ముస్లిం వర్గంపై దీని ప్రభావం అత్యధికంగా ఉంది. 6.5 కోట్లున్న గుజరాత్‌ జనాభాలో ముస్లింలు 11% ఉన్నారు. 25 అసెంబ్లీ స్థానాల్లో వీరు ప్రభావం చూపించగలరు. బిల్కిస్‌ బానోకి న్యాయం జరగాలని వీరు చేస్తున్న ఆందోళనలు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న చర్చ జరుగుతోంది.

కరెంట్‌ కష్టాలు
దేశంలో కరెంట్‌ చార్జీలు అత్యంత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇది. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉన్నప్పటికీ నెల తిరిగేసరికల్లా వచ్చే బిల్లుని చూసి సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు. ఇక కమర్షియల్‌ విద్యుత్‌ టారిఫ్‌ కూడా చాలా ఎక్కువగా ఉంది. పరిశ్రమలకిచ్చే కరెంట్‌ చార్జీలు ఇతర రాష్ట్రాల్లో యూనిట్‌కి రూ.4 ఉంటే గుజరాత్‌లో ఏకంగా రూ.7.50గా ఉండడంతో వాణిజ్యవేత్తల్లో కూడా అసంతృప్తి నెలకొంది. ఆప్, కాంగ్రెస్‌ గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీలు ఇచ్చారు.

రైతు సమస్యలు
గుజరాత్‌ రాష్ట్రాన్ని గత రెండేళ్లుగా వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పంట నీటిపాలై రైతులకు కడగండ్లే మిగులుతున్నాయి. అయినప్పటికీ వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందడం లేదు. ఇక అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో రైతుల దగ్గర్నుంచి ప్రభుత్వం భారీగా భూముల్ని సేకరించింది. అహ్మదాబాద్, ముంబై బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు, వడోదర, ముంబై ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు కోసం చేసిన భూ సేకరణ వివాదాస్పదమైంది.  

పేపర్‌ లీక్స్‌
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్ష పేపర్ల లీకేజీ యువతలో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. తరచుగా పేపర్స్‌ లీక్‌ కావడం పరీక్షలు వాయిదా పడడం నిరుద్యోగుల ఆశల్ని
అడియాసలు చేస్తోంది. గత ఏడేళ్ల కాలంలో ఎనిమిది సార్లు వివిధ పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీకయ్యాయి.  

మోర్బీ వంతెన దుర్ఘటన
సౌరాష్ట్ర ప్రాంతంలోని మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి అక్టోబర్‌ 30న కుప్పకూలిపోయి 135 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా ఈ సారి ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. కాంట్రాక్టులు, స్థానిక ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకి బదులుగా ప్రమాద సమయంలో నదిలోకి దూకి ప్రాణాలను కాపాడిన మాజీ ఎమ్మెల్యే కాంతి అమృతియకు టికెట్‌ ఇవ్వడం చూస్తేనే దీని ప్రభావం ఎంత ఉందనేది అర్థమవుతుంది.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-11-2022
Nov 17, 2022, 06:38 IST
అహ్మదాబాద్‌: గుజరాత్‌లో కీలకమైన మైనారిటీల ఓట్లను ఒడిసిపట్టేందుకు బీజేపీ మినహా పార్టీలన్నీ ఈసారి సర్వ శక్తియుక్తులూ కేంద్రీకరిస్తున్నాయి. ముఖ్యంగా ఏళ్ల...
15-11-2022
Nov 15, 2022, 06:16 IST
గుజరాత్‌లో 27 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ చేయని ప్రయత్నాల్లేవు! ప్రధాని మోదీ సొంత...
11-11-2022
Nov 11, 2022, 06:33 IST
సిమ్లా: బీజేపీని మరోసారి గెలిపించి, చరిత్ర తిరగరాయాలని ప్రధాని మోదీ హిమాచల్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కమలం గుర్తుకు వేసే...
11-11-2022
Nov 11, 2022, 05:54 IST
రెండు పార్టీలు, రెండు కుటుంబాలు, రెండు కులాలు.. హిమాచల్‌ ప్రదేశ్‌ రాజకీయాలు వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. రాజ్‌పుట్‌లు, బ్రాహ్మణులు ఈ...
07-11-2022
Nov 07, 2022, 05:40 IST
అహ్మదాబాద్‌:  ‘‘నాకు ‘ఏ’ అంటే ఆదివాసీలు. వారి ఆశీస్సులతో గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నా. ఆదివాసీలు...
06-11-2022
Nov 06, 2022, 06:20 IST
సోలన్‌ (హిమాచల్‌ప్రదేశ్‌): ‘‘కరడుగట్టిన నిజాయతీపరుమని చెప్పుకునే ఆమ్‌ ఆద్మీ పార్టీ నిజానికి అత్యంత అవినీతిమయం. ఇకకాంగ్రెసైతే అవినీతికి, స్వార్థ రాజకీయాలకు,...
10-04-2022
Apr 10, 2022, 05:58 IST
న్యూఢిల్లీ: బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ) అధినేత్రి మాయావతిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి...
27-03-2022
Mar 27, 2022, 12:07 IST
లక్నో: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో సమాజ్‌వాదీపార్టీలో మళ్లీ కుటుంబ కలహాలు మొదలైనట్లు కనిపిస్తున్నాయి. శాసనసభా పక్ష సమావేశానికి తనను పిలవలేదని అఖిలేష్‌...
23-03-2022
Mar 23, 2022, 07:10 IST
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌ లోక్‌సభ ఎంపీగా ఉన్న...
19-03-2022
Mar 19, 2022, 13:53 IST
చంఢీగఢ్‌: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సర్కార్‌ కొలువుదీరిసింది. చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం...
18-03-2022
Mar 18, 2022, 13:49 IST
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మట్టి కరిపించాలనుకున్న సోకాల్డ్‌ సెక్యులర్‌ పార్టీలు చతికిల పడ్డాయి.
17-03-2022
Mar 17, 2022, 18:39 IST
సొంత పార్టీ నేతలపైనే నేరుగా విమర్శలు చేసి వార్తల్లో నిలిచే నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ.. అప్పుడు అమరీందర్​సింగ్ ​కాంగ్రెస్‌ను వీడేందుకు కారణమై.. ఇప్పుడు...
17-03-2022
Mar 17, 2022, 04:20 IST
ఎస్‌బీఎస్‌ నగర్‌ (పంజాబ్‌): ‘‘పంజాబ్‌ అభివృద్ధి కోసం ఈ రోజు నుంచే రంగంలోకి దిగుతాం. ఒక్క రోజు కూడా వృథా...
17-03-2022
Mar 17, 2022, 00:00 IST
విప్లవ వీరుడు భగత్‌ సింగ్‌ గ్రామం ఖత్కర్‌ కలన్‌లో బుధవారం భారీ జనసందోహం మధ్య సాగిన పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రి...
16-03-2022
Mar 16, 2022, 17:36 IST
ఆప్‌ అభ్యర్థులు హేమాహేమీలను మట్టికరిపించి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్‌ సీఎంతో సహా సీనియర్‌ నాయకులను ఓడించి సత్తా చాటారు.
16-03-2022
Mar 16, 2022, 13:15 IST
ఛండీగఢ్‌: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీని మరింత ఆందోళనకు గురి చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర...
15-03-2022
Mar 15, 2022, 19:45 IST
ఢిల్లీ: ఇటీవల జరిగిన  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడటంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రక్షాళన చేపట్టింది. ఆయా...
15-03-2022
Mar 15, 2022, 00:27 IST
మారుతున్న మనోభావాలకు ప్రతిస్పందించడం ద్వారా బీజేపీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాగ్రహం నుంచి తప్పించుకుంది. ప్రత్యామ్నాయ కృషిని ప్రజల ముందు...
14-03-2022
Mar 14, 2022, 19:22 IST
ఆప్ నాయకుడు భగవంత్ మాన్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఒకరోజు ముందు లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
14-03-2022
Mar 14, 2022, 07:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత ఎన్నికలయ్యేవరకు సోనియా గాంధీనే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో...



 

Read also in:
Back to Top