
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. దీంతో, త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ రానున్నారు.
వివరాల ప్రకారం.. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రుద్రరాజు తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఏపీకి కొత్త పీసీసీ చీఫ్‌ను ఏఐసీసీ నియమించే అవకాశం ఉంది.