టీడీపీలో మరో మహిళా నేతకు అవమానం

Criticism On Removal Of Pratibha Bharati From TDP Politburo - Sakshi

ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో నుంచి ప్రతిభా భారతిని తప్పించడంపై విమర్శలు 

మహిళా నేతలను అవమాన పరిచే విధంగా పార్టీ నిర్ణయాలు    

సాక్షి, శ్రీకాకుళం : టీడీపీలో మరో మహిళా నేతకు అవమానం జరిగింది. మొన్నటికి మొన్న గౌతు శిరీషను పదవి నుంచి తొలగించగా.. తాజాగా ఎస్సీ మహిళ, టీడీపీ సీనియర్‌ నేత కావలి ప్రతిభా భారతికి అన్యాయం జరిగిందంటూ ఆ పార్టీ శ్రేణుల్లోనే తీవ్రమైన చర్చ జరుగుతోంది. సుదీర్ఘ కాలం పార్టీలో పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా పనిచేసిన తనను తప్పించి పార్టీలు మారి వచ్చిన కిమిడి కళా వెంకటరావుకు చోటు కల్పించడమేంటని ఆమె తీవ్రంగా మధనపడుతున్నట్టు తెలిసింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించినప్పటికీ ఆమెకు రుచించడం లేదు. కీలకమైన పొలిట్‌ బ్యూరో నుంచి తప్పించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆమె తీవ్ర ఆవేదనతో ఉన్నారని, పార్టీ పెద్దలు ఫోన్‌ చేసినప్పటికీ టచ్‌లోకి రాలేదని సమాచారం.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌తో పాటు పలు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన కావలి ప్రతిభా భారతి టీడీపీలో సీనియర్‌ నేత. అయితే ఆ పార్టీలో వర్గ, కుటుంబ రాజకీయాల వల్ల ఆమె స్థాయికి తగ్గ గౌరవం ఇవ్వడం లేదు. మొ న్నటి ఎన్నికల్లో ఏకంగా అసెంబ్లీ సీటు కూడా ఇవ్వలేదు. కొద్ది నెలల పాటు ఉండే ఎమ్మెల్సీ పోస్టు ఇచ్చి చేతులు దు లుపుకున్నారు. చివరికి పార్టీలో కూడా ప్రాధాన్యతను అధిష్టానం తగ్గించేసింది. సుదీర్ఘ కాలం పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా పనిచేసిన ప్రతిభా భారతికి ఈసారి ఊహించని పరిణామం ఎదురైంది.  (బాబు బడాయి.. నేతల లడాయి!)

రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ఆ స్థానంలో ఉన్న కళా వెంకటరావుకు పొలిట్‌ బ్యూరోలో చోటు కల్పించేందుకు ప్రతిభా భారతిని బలి చేశారని ఆమెతో పాటు అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుని మొదటి నుంచి పని చేస్తూ, ఏ పార్టీ వైపు చూడకుండా రాజకీయం చేస్తున్న ప్రతిభా భార తికి ఉద్దేశపూర్వకంగా పొలిట్‌ బ్యూరోలో మొండి చేయి చూ పారని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అనేక అవినీ తి ఆరోపణలు ఉన్న వ్యక్తికి కీలక పదవి, పార్టీ మారిన వ్యక్తి కోసం తనను తప్పించి చోటు కల్పించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలిసింది.  (అవినీతి నేతకు అధ్యక్ష పదవా?)

ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి గౌతు శ్యామ సుందర్‌ శివాజీ కుమార్తె గౌతు శిరీషను ఎలాగైతే మాటైనా చెప్పకుండా మార్చేశారో అదేవిధంగా ప్రతిభా భారతికి కూడా చె ప్పకుండా పొలిట్‌ బ్యూరో నుంచి తప్పించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాడు శిరీషకు అవమానం జరగగా, నేడు ప్రతిభా భారతికి ప్రాధాన్యత తగ్గించి అన్యాయం చేశారని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. జిల్లాలో వ్యూహాత్మకంగానే మహిళా నేతల ప్రాధాన్యత తగ్గిస్తున్నట్టు వారి అనుచర వర్గాలు భావిస్తున్నాయి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top