బీజేపీతో జతకట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పవన్‌ 

CPM Leader Madhu Comments On Pawan Kalyan - Sakshi

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు 

నెల్లూరు రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బీజేపీతో జతకట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. జనసేన, బీజేపీ కలయిక ప్రజలపై ఆర్థిక భారం మోపేందుకే ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు. నెల్లూరు రూరల్‌ పరిధి కొత్తూరులో ప్రారంభమైన సీపీఎం మహాసభలకు ఆయన బుధవారం హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో కేంద్రంలో రెండో దఫా అధికారం చేపట్టిన బీజేపీ నియంత పాలన సాగిస్తోందన్నారు. బ్రిటిష్‌ పాలకులు ప్రజలను ఇబ్బందులు పెట్టేలా వివిధ రకాల పన్నులు వేశారని, వారిని తలపించే విధంగా నేడు బీజేపీ సర్కార్‌ జీఎస్టీ, ఎక్సైజ్‌ డ్యూటీ ఇలా రకరకాలుగా పన్నులు విధించడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలను ఆకాశాన్నంటేలా చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని ప్రయత్నాలు సాగించడం ఏ మాత్రం తగదన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top