ఈటల వ్యాఖ్యలు దురదృష్టకరం: జూలకంటి | CPM Leader Julakanti Ranga Reddy Comments On MLA Etela Rajender | Sakshi
Sakshi News home page

ఈటల వ్యాఖ్యలు దురదృష్టకరం: జూలకంటి

Aug 22 2022 5:01 AM | Updated on Aug 22 2022 5:01 AM

CPM Leader Julakanti Ranga Reddy Comments On MLA Etela Rajender - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు బీజేపీ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కమ్యూనిస్టులపై చేసిన ఆరోపణలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు­డు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమ స్యలపై పోరాటాలు నడిపిస్తున్న చరిత్ర కమ్యుని­స్టులకు ఉందన్నారు.

ముఖ్యంగా కొంత కాలంగా రాష్ట్రంలో పోడు భూముల సమస్య, కౌలు రైతుల సమస్యలపై పోరాడుతున్నా­మన్నారు. ఈ సమ­స్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఏ ప్రభుత్వం ఉన్నా పోరాటాలు సాగిస్తూనే ఉంటామన్నారు. ఇవన్నీ చూస్తూ కూడా ఈటల రాజేందర్‌ మునుగోడులో కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం దురదృష్టకరమని రంగారెడ్డి విచారం వ్యక్తంచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement