సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రసమయి జోలపాడుతున్నారు..

Congress Party District President Kavvampalli Satyanarayana Comments On Rasamayi Balakishan In Karimnagar - Sakshi

సాక్షి, శంకరపట్నం(కరీంనగర్‌): దళిత బంధును హుజూరాబాద్‌కే పరిమితం చేసిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ జోలపాడుతున్నారని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. శంకరపట్నం మండలం ముత్తారం, మక్త, మొలంగూర్, కొత్తగట్టు గ్రామాల్లో శనివారం దళిత, గిరిజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానకొండూర్‌ ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గానికి దళిత బంధు తీసుకురాకుండా కేసీఆర్‌ మెప్పు కోసం పాటలు పాడుతూ కాలక్షేపం చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలోని దళిత, గిరిజనులందరికీ ఈ పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, నాయకలు పద్మ, మధుకర్, శ్రీనివాస్, చంద్రమౌళి, జహంగీర్, మల్లారెడ్డి, సాంబయ్య, బుచ్చయ్య, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: ‘డబుల్‌’ ఇళ్ల పంపిణీ: సీఎం ఇంట్లో లిఫ్ట్‌ మాదిరే ఇక్కడ కూడా 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top