Congress MP Komatireddy Venkat Reddy Key Comments Munugode Election - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. పార్టీ నుంచి వెళ్లగొట్టే..

Aug 12 2022 12:57 PM | Updated on Aug 12 2022 1:17 PM

Congress MP Komatireddy Venkat Reddy key comments Munugode Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికకు తాను పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

'ఉపఎన్నిక కసరత్తు మీటింగ్‌కు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదు. ఏ మీటింగ్‌ జరిగినా నాకు సమాచారం ఇవ్వడం లేదు. నాకు ఆహ్వానం లేని మీటింగ్‌కు నేను ఎందుకు వెళ్తా. చండూరులో సభలో అసభ్యంగా తిట్టించారు. హోంగార్డుతో పోల్చారు. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. నన్ను అవమానిస్తే పార్టీ నుంచి వెళ్లిపోతాను అనుకున్నారు. నన్ను వెళ్లగొట్టి కాంగ్రెస్‌ను ఖాళీ చేద్దామనుకుంటున్నారు. అన్ని విషయాలు సోనియా, రాహుల్‌తో మాట్లాడతా. ఉప ఎన్నిక వస్తుంది కాబట్టే కేసీఆర్‌ కొత్త పెన్షన్లు ఇస్తున్నారు' అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 

చదవండి: (Telangana-IPS Officers: పోస్టింగ్‌ లేదు.. వెళ్లిపోదాం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement