‘బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఫిక్సింగ్‌లో భాగమే’ | Congress MP Chamala Kiran Slams BJP And BRS | Sakshi
Sakshi News home page

‘బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఫిక్సింగ్‌లో భాగమే’

Jun 30 2025 3:35 PM | Updated on Jun 30 2025 3:59 PM

Congress MP Chamala Kiran Slams BJP And BRS

ఢిల్లీ : తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం బీజేపీ-బీఆర్‌ఎస్‌ల మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగమేనన్నారు కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి.  బీజేపీ-బీఆర్‌ఎస్‌లు మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో ఉన్నాయనే విషయం దీని ద్వారా నిరూపితమైందంటూ సెటైర్లు వేశారు. 

ఈరోజు(సోమవారం, జూన్‌ 30) ఢిల్లీ నుంచి మాట్లాడిన చామల.. కేసీఆర్‌ గెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని, అటువంటప్పుడు దోచుకోవడానికి ఏముంటుందని ప్రశ్నించారు కిరణ్‌కుమార్‌రెడ్డి

‘మీరు(కేంద్రం) ఏమైనా నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తుంది. బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుపుకోసం బీఆర్‌ఎస్‌ చేసింది అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో కూడా  ఆ రెండు పార్టీలు అదే రూట్‌ మ్యాచ్‌తో ముందుకు వెళ్లనున్నాయి. హైదరాబాద్‌లో మెట్రోకు పునాదులు వేసింది ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం. 

కిషన్‌రెడ్డి.. తెలంగాణ, హైదరాబాద్‌ సమస్యల విషయంలో నోరు విప్పరు. హైదరాబాద్‌ నగర ప్రజకు కిషన్‌రెడ్డి చేసిందేమిటి?, ఈ ఏడాది కేంద్రం నయా పైసా ఇవ్వలేదు. విభజన హామీలు నెరవేర్చలేదు. హైదరాబాద్‌ మెట్రో కోసం ఐదారుసార్లు సీఎం రేవంత్‌ ఢిల్లీకి వచ్చారు. మనం కట్టిన ట్యాక్సుల్లో మన వాటా వెనక్కి రావడం లేదు. సీఎం రేవంత్‌ తన ప్రయత్నం తాను చేస్తున్నారు.. కిషన్‌రెడ్డి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచెయ్యాలి’ అని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. 

బీజేపీ హైకమాండ్‌ కీలక నిర్ణయం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆయనే..

Advertisement
 
Advertisement
Advertisement