రాష్ట్రానికి చంద్రబాబు | Chandrababu arrived in AP on 7th october evening from Hyderabad | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి చంద్రబాబు

Oct 8 2020 5:37 AM | Updated on Oct 8 2020 5:37 AM

Chandrababu arrived in AP on 7th october evening from Hyderabad - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి బుధవారం సాయంత్రం ఏపీకి వచ్చారు. రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అమరావతిలో నిర్వహిస్తున్న నిరసనలు సోమవారానికి 300వ రోజుకు చేరుకోనున్నాయి.

ఈ సందర్భంగా సోమవారం ఆన్‌లైన్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన రాష్ట్రానికి వచ్చినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు చివరిసారిగా ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టయిన అచ్చెన్నాయుడు బెయిల్‌పై విడుదలైనప్పుడు ఆయన్ని పరామర్శించేందుకు విజయవాడకు వచ్చారు. 2 రోజులు ఉండి మళ్లీ హైదరాబాద్‌ తిరిగి వెళ్లిపోయారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement