ఎన్నికల హింసపై వివరాలన్నీ కావాలి

Calcutta High Court Orders CBI Probe Into West Bengal Post-Poll Violence Cases - Sakshi

పశ్చిమ బెంగాల్‌ డీజీపీకి సీబీఐ లేఖ

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని సీబీఐ అడిగింది. అందులో  హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలకు సంబంధించి నమోదైన కేసుల వివరాలన్నింటి ఇవ్వాలంటూ ఒక లేఖ రాసింది.  ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై దర్యాప్తును  కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు  సన్నద్ధమైంది. ఇందు కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. జాయింట్‌ డైరెక్టర్లు రమణీష్, అనురాగ్, వినీత్‌ వినాయక్, సంపత్‌ మీనా ఆధ్వర్యంలోని బృందాలు దీనిపై విచారణ చేపట్టనున్నారు. ఒక్కో బృందంలో  ఏడుగురు సభ్యులు ఉన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అధికారుల్ని తెచ్చి ఈ బృందాల్లో నియమించింది. సీబీఐ అదనపు డైరెక్టర్‌ అజయ్‌ భట్నాగర్‌ ఈ విచారణను పర్యవేక్షిస్తారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top