హైకోర్టులో మమతకు చుక్కెదురు | Calcutta HC Dismisses Mamata Govt Plea, NHRC To Probe Post Poll Violence | Sakshi
Sakshi News home page

హైకోర్టులో మమతకు చుక్కెదురు

Published Tue, Jun 22 2021 11:41 AM | Last Updated on Tue, Jun 22 2021 11:53 AM

Calcutta HC Dismisses Mamata Govt Plea, NHRC To Probe Post Poll Violence - Sakshi

కోల్‌కతా: బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటన కేసులను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) విచారించాలంటూ కలకత్తా హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై కోర్టుకెళ్లిన మమత సర్కార్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని బెంగాల్‌ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఘర్షణ సంబంధ కేసుల్ని విచారించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని హైకోర్టు గతంలో ఆదేశించింది.

ఈ ఆదేశాలను రీకాల్‌ చేయాలంటూ బెంగాల్‌ ప్రభుత్వం కోరగా అందుకు కోర్టు నో చెప్పింది. కాగా, హైకోర్టు గత ఆదేశాలకు అనుగుణంగా కేసుల విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా ఓ కమిటీని ఏర్పాటుచేసినట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement