గుజరాత్‌ మళ్లీ బీజేపీదే.. ఆప్‌కు సింగిల్ డిజిటే! | BJP Will Retain Gujarat APP Vote Share May Increase | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో అధికారం బీజేపీకే.. ఆప్‌కు రెండు సీట్లే!

Oct 3 2022 7:21 AM | Updated on Oct 3 2022 7:21 AM

BJP Will Retain Gujarat APP Vote Share May Increase - Sakshi

ఈ సంవత్సరం ఆఖర్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి 135–143 సీట్లు వస్తాయని ఒపీనియన్‌ పోల్‌ తెలియజేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ గణనీయమైన ఓట్లు సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఒకటి నుంచి రెండు సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది.

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో అధికార పీఠాన్ని మళ్లీ బీజేపీ దక్కించుకోనుందని ఏబీపీ న్యూస్‌–సీ ఓటర్‌ ఒపీనియన్‌ పోల్‌ ఆదివారం వెల్లడించింది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ సంవత్సరం ఆఖర్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి 135–143 సీట్లు వస్తాయని ఒపీనియన్‌ పోల్‌ తెలియజేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ గణనీయమైన ఓట్లు సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఒకటి నుంచి రెండు సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది.

ప్రతిపక్ష కాంగ్రెస్‌ 36–44 స్థానాలు గెలుచుకోనుందని వివరించింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ పట్ల ఓటర్లు సానుకూలత వ్యక్తం చేస్తున్నారని, ఆయన మరోసారి సీఎం కావాలని కోరుకుంటున్నారని ఒపీనియన్‌ పోల్‌లో తేలింది.
చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement