టీఆర్‌ఎస్‌ నేతలు నీచమైన, హేయమైన పద్ధతికి దిగారు | BJP Will Be Win In Huzurabad Elections Says Etela Rajender | Sakshi
Sakshi News home page

ఏం చేసినా హుజురాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే

Jul 4 2021 2:06 PM | Updated on Jul 4 2021 2:28 PM

BJP Will Be Win In Huzurabad Elections Says Etela Rajender - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎన్ని ఎత్తులు వేసినా, కుట్రలు చేసినా.. హుజురాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానేనని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు నీచమైన, హేయమైన పద్ధతికి దిగారన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హుజురాబాద్‌ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. తరుణ్‌చుగ్‌, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ అబద్ధాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement