Munugode Politics: మునుగోడుపై కమలనాథుల వ్యూహమేంటీ? 

BJP Strategy On Munugode By Poll - Sakshi

మాజీ ఎంపీ వివేక్‌కు ఉప ఎన్నికల బాధ్యతలను పూర్తిగా అప్పగించినట్టేనా? 

గతానికి భిన్నంగా స్టీరింగ్‌ కమిటీని తెరమీదికి తెచ్చారెందుకు?

పదవి ఆశించిన అందరిని కమిటీలో చేర్చారా? 

సాక్షి, హైదరాబాద్‌/నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా వివేక్‌ను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. 16 మందితో స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. స్థానికుడైన గంగిడి మనోహర్‌రెడ్డికి కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించారు.
చదవండి: మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల! 

సభ్యులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి, రవీంద్ర నాయక్, రాపోలు ఆనంద్ భాస్కర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీ నారాయణ, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ నేషనల్ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి, దాసోజు శ్రవణ్‌ను నియమించారు.

దుబ్బాక, హుజురాబాద్ తరహాలో ఉప ఎన్నిక ఇంచార్జీ అని కాకుండా స్టీరింగ్ కమిటీ అని ప్రకటించడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ కోసం నేతలు పోటీ పడ్డారు. కానీ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మాత్రం వివేక్ పేరు ప్రతిపాదించారు. ఇతర నేతలను నారాజ్ చేయకుండా స్టీరింగ్ కమిటీ పేరుతో 16 మంది టీం ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా ఇంచార్జ్‌లను ప్రకటించనున్నారు. వచ్చే వారంలో ప్రతి గ్రామానికి ఇంచార్జ్‌ని నియమించి బూత్ స్థాయిలో పోల్ మేనేజ్‌మెంట్ చేయడానికి బీజేపీ పటిష్ట కార్యాచరణ రూపొందిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top