క్విడ్‌ప్రోకోతోనే ఖమ్మం సభ: రఘునందన్

సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో బుధవారం నిర్వహించే బీఆర్‌ఎస్ ఆవిర్భావసభ నిర్వహణ వెనుక ‘క్విడ్‌ప్రోకో’కోణం ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఆరోపించారు. మియాపూర్ హఫీజ్‌పేట్‌లోని సర్వే నంబర్ 78లో ఆదిత్య కంపెనీ పేరిట తోట చంద్రశేఖర్ కొన్న 40 ఎకరాల ప్రభుత్వ భూములను (సుమారు రూ.4వేల కోట్ల విలువ) ఆయనకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
ఇందుకు ప్రతిఫలంగా ‘క్విడ్‌ప్రోకో’కింద ఖమ్మం సభకు చంద్రశేఖర్‌తో ఖర్చు పెట్టిస్తున్నారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ భూములను బీఆర్‌ఎస్ ఏపీ విభాగం అధ్యక్షుడికి ఎలా కట్టబెడుతున్నారో ఖమ్మం సభలో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాం నవాబు వారసుడికి అధికారిక అంత్యక్రియలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా తెలంగాణ పోరాట అమరు లను అవమానించినట్ల అయ్యిందన్నారు.
మరిన్ని వార్తలు