అరెస్ట్‌ భయంతోనే మోదీపై కవిత ఆరోపణలు 

BJP leader DK Aruna Comments On Kalvakuntla Kavitha - Sakshi

బీజేపీ నేత డీకే అరుణ   

సాక్షి, హైదరాబాద్‌: మద్యం కుంభకోణంలో అరెస్ట్‌ చేస్తారనే భయంతోనే ప్రధాని నరేంద్రమోదీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రధానిపై ఆరోపణలు చేసినందుకే తనను అరెస్ట్‌ చేశారని చెప్పుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ధర్నాలు, ఆరోపణలు అని  పేర్కొన్నారు.

కవితకు అకస్మాత్తుగా మహిళలపై ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు.  గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరిగిందని ధర్నా చేస్తున్న బీఅర్‌ఎస్‌ నేతలు, ముందుగా కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రగతిభవన్‌ వద్ద ధర్నా చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభు త్వం పెంచిన పన్నులపై బీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పాలని, పెంచిన విద్యుత్, ఆర్టీసీ, లాండ్‌ రిజిస్ట్రేషన్, చార్జీలను తగ్గించాలని, లేదంటే రానున్న రోజుల్లో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమని అరుణ హెచ్చరించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top