బరిలో ఉమ్మడి అభ్యర్థి | BJP, Janasena Joint candidate Will Be Contest In Tirupati By Election | Sakshi
Sakshi News home page

బరిలో ఉమ్మడి అభ్యర్థి

Mar 24 2021 4:48 AM | Updated on Mar 24 2021 4:48 AM

BJP, Janasena Joint candidate Will Be Contest In Tirupati By Election - Sakshi

మాట్లాడుతున్న పురందేశ్వరి, పక్కన వీర్రాజు తదితరులు

తిరుపతి అర్బన్‌: తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థినే బరిలో నిలుపుతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి పేర్కొన్నారు. తిరుపతిలో మంగళవారం  మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీటీడీకి చెందిన భూములను ధారదత్తంగా విక్రయిస్తున్న యాజమాన్య తీరును అడ్డుకున్నది బీజేపీనే అని తెలిపారు.

రాష్ట్రంలో ఇసుక పాలసీ తప్పుదోవ పడుతోందని విమర్శించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఫేక్‌ ఐడీ కార్డులతో దొంగ ఓట్లు వేశాయని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇసుక పాలసీని రద్దు చేసి పేదలకు ఉచితంగా ఇసుకను అందజేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement