బద్వేలు ఉప ఎన్నిక: ముగిసిన ప్రచారం | Sakshi
Sakshi News home page

బద్వేలు ఉప ఎన్నిక: ముగిసిన ప్రచారం

Published Wed, Oct 27 2021 10:45 AM

Badvel By Election Campaign Ends Today - Sakshi

సాక్షి, కడప: ఈనెల 30న జరగనున్న బద్వేలు ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది. దీంతో ఈనెల 27న బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రచార పర్వానికి తెర పడింది. ఈనెల 30న బద్వేల్ పోలింగ్‌కు కొత్త నిబంధనలు ప్రకారం 72 గంటల ముందే ముగిసిన ఎన్నికల ప్రచారం ముగిసింది. బద్వేల్ నియోజకవర్గంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. నియోజకవర్గంలో నలువైపులా విస్తృతంగా పోలీస్ తనిఖీలు నిర్వహించారు. బయట వ్యక్తులు నియోజకవర్గం విడిచి వెళ్లాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30న 2 లక్షల 15 వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

బద్వేల్ బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉన్నారు. బద్వేలులో త్రిముఖ పోరు నడుస్తోంది. వైఎస్సార్‌సీపీ తరపున డాక్టర్‌ సుధ, కాంగ్రెస్‌ తరపున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, బీజేపీ తరపున పనతల సురేష్‌ పోటీలో ఉన్నారు. వీరుగాక మరో 12మంది వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల తరపున ఇప్పటికే పలువురు అగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. (చదవండి: Rain Alert: ఏపీలో రెండు రోజులు వర్షాలు)

వైఎస్సార్‌సీపీ తరపున మం6తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు అంజద్‌బాషా, నారాయణస్వామి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ప్రచారాన్ని వేడెక్కించారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యత సాధించిన వైఎస్సార్‌సీపీ ఫుల్‌ జోష్‌లో ఉంది. బద్వేలు ఉప ఎన్నికలో భారీ మెజార్టీ సాధిస్తుందనే ధీమా  పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్‌ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొంటున్నారు. (చదవండి: ఇక కష్టాలు దూరమండి.. కొండ కోనల్లో ఆపద్బాంధవి)  

ఎత్తులు.. పై ఎత్తులు
ఈనెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ అనంతరం 11న పరిశీలన, 13న ఉపసంహరణ కార్యక్రమాలు నిర్వహించారు. బరిలో 15మంది అభ్యర్థులు మిగిలారు. నామినేషన్ల దాఖలు అనంతరం వ్యూహాలు, ఎన్నికల ఎత్తులు, ప్రచార పర్వంలో నేతలు నిమగ్నమయ్యారు. దాదాపు 20నుంచి 25 రోజులుగా ప్రధాన పార్టీల నేతలతోపాటు స్వతంత్రులు ప్రచారం చేస్తూ వచ్చారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధకు భారీ మెజార్టీ తీసుకొచ్చేందుకు పలువురు నేతలు ప్రణాళికలు రూపొందిస్తూ.. ఎక్కడికక్కడ కార్యకర్తలతో సమాలోచనలు చేస్తూ వచ్చారు. బీజేపీతోపాటు కాంగ్రెస్‌ అభ్యర్థుల కోసం రాష్ట్ర నేతలు కూడా బద్వేలులో మకాం వేసి ప్రచారం నిర్వహించారు.

Advertisement
Advertisement