సాక్షి, హైదరాబాద్: మంత్రిగా అజహరుద్దీన్ రేపు(నవంబర్ 10, సోమవారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. అజహరుద్దీన్‌కు మైనారిటీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. అజహరుద్దీన్ గత నెల 31న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
కాగా, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వద్ద ఉండేది. తాజాగా అజహరుద్దీన్‌కు ఆ శాఖలను కేటాయించారు. ఇప్పుడు సీఎం రేవంత్ వద్ద హోం, విద్య, శాంతి భద్రతలు, వాణిజ్య పన్నులు, పురపాలక, సాధారణ పరిపాలన శాఖలతో పాటు ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు మిగిలి ఉన్నాయి. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖలు మిగిలాయి.


