భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలియన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో..
భక్తులకు మా నిరాడంబరమైన సేవను కొనసాగిస్తూ, తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కొరకు ఒక ఆధునికమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వంటశాలను (కిచెన్) నిర్మించనున్నట్లు తెలియజేయడానికి మేము ఎంతో గౌరవంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా అంబానీ పేర్కొన్నారు.


