బాబు అరెస్టయినా జనాలు పట్టించుకోవడం లేదు.. అచ్చెన్నాయుడు ఆడియో లీక్‌

Atchannaidu Audio Leak: Tdp Forced Mass Mobilization - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ బలవంతపు జన సమీకరణకు ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు అరెస్టయినా కార్యకర్తలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. వెంటనే జన సమీకరణ చేయాలంటూ నాయకులతో అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అచ్చెన్న టీడీపీ నేతలతో మాట్లాడిన టెలీ కాన్ఫరెన్స్‌ ఆడియో లీకైంది.

ప్రజలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలను రోడ్డు మీదకు తీసుకురావాలంటూ ఆదేశాలిచ్చారు. మహిళలను తీసుకొస్తే పోలీసులు అడ్డుకోరంటూ నాయకులకు సలహాలు ఇస్తున్నారు. బాబు అరెస్ట్‌ను ప్రజలు పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తోందని అచ్చెన్నాయుడు నిట్టూర్పులు విడుస్తున్నారు.
చదవండి: చంద్రబాబు ‘స్కిల్‌’ స్కాం: కోర్టులో ఎవరి వాదన ఏంటీ? 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top