CM YS Jagan: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్‌ ట్వీట్‌

AP Municipal Elections 2021 Results CM YS Jagan Reacts On Twitter - Sakshi

సాక్షి, తాడేపల్లి: నెల్లూరు కార్పొరేషన్‌ సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. అన్ని ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 

ముఖ్యంగా నెల్లూరు కార్పొరేషన్‌లో ఉన్న 54 స్థానాలను (8 స్థానాలు ఏకగ్రీవం) క్లీన్‌స్వీప్‌ చేసి వైఎస్సార్‌సీపీ చరిత్ర సృష్టించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీలోనూ వైఎస్సార్‌సీపీ ఘన విజయాన్ని సాధించింది. 25 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 19 చోట్ల విజయం సాధించారు. మరో 6 చోట్ల టీడీపీ గెలుపొందింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఓటరు దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు.

‘దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.
(చదవండి: కుప్పంలో కుప్పకూలిన టీడీపీ)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top