ఉండవల్లి శ్రీదేవి కాదు ఊసరవెల్లి శ్రీదేవి: మంత్రి అమర్‌నాథ్‌

Andhra Pradesh: Minister Gudivada Amarnath Fires Undavalli Sridevi - Sakshi

సాక్షి, విశాఖపట్నం:  ఉండవల్లి శ్రీదేవికి నాలుగేళ్లుగా కనిపించని లోపాలు ఇప్పుడు ఎలా బయటికి వస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. ఆమె ఉండవల్లి శ్రీదేవి కాదు ఊసరవెల్లి శ్రీదేవి అని వ్యంగాస్త్రాలు సంధించారు. సినీనటి శ్రీదేవికి మించి నటించిందని దుయ్యబట్టారు.

ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేసే ముందు జగన్‌మోహన్‌రెడ్డి దగ్గరికి కూతురుని తీసుకెళ్లి ఫోటో దిగింది.. ఆయన అభిమాని అని నమ్మించి మోసం చేయాలని భావించిందని మండిపడ్డారు. ఆమె మరి కొద్ది రోజుల్లోనే చీకొట్టే స్థితికి చేరుకుంటుందని,  శ్రీదేవి లాంటి నమ్మకద్రోహుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.

అంతా చంద్రబాబు స్క్రిప్ట్‌ ప్రకారమే
చంద్రబాబు స్క్రిప్ట్‌ ప్రకారమే శ్రీదేవి మాట్లాడారని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ ధ్వజమెత్తారు. దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం చంద్రబాబుకి అలవాటేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏనాదైనా ఎస్సీలకు పదవులిచ్చారా అని ప్రశ్నించారు. దళితులు రాజకీయంగా ఎదగడానికి సీఎం జగన్‌ అవకాశాలు కల్పిస్తున్నారని .. అదే క్రమంలో పార్టీ లైన్‌ దాటితే ఎవరిపైనైనా చర్యలు ఉంటాయన్నారు.  జగన్‌ను మోసం చేసినోళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top