ఎన్నికల ప్రచారంలో 'రామ్ చరణ్' హీరోయిన్.. ఎవరికోసమో తెలుసా? | Actor Neha Sharma in Mega Roadshow Video Viral | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచారంలో 'రామ్ చరణ్' హీరోయిన్.. ఎవరికోసమో తెలుసా?

Apr 25 2024 9:36 PM | Updated on Apr 25 2024 9:36 PM

Actor Neha Sharma in Mega Roadshow Video Viral

పాట్నా: 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎలక్షన్  క్యాంపెయిన్​లో కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా.. సినీతారలు కూడా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే రామ్ చరణ్ సరసన 'చిరుత' సినిమాలో హీరోయిన్‌గా నటించిన 'నేహా శర్మ' ఇటీవల బీహార్‌ రోడ్‌షోలో పాల్గొంది.

కాంగ్రెస్ పార్టీ తరపున భాగల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న నటి నేహా శర్మ తండ్రి అజిత్ శర్మకు మద్దతుగా ఈమె రోడ్‌షోలో కనిపించింది. బంకా, కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియాతో సహా బీహార్‌లోని వివిధ జిల్లాల గుండా ఆమె రోడ్‌షోలలో తన ప్రయాణం కొనసాగించింది. దీనికి సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది. 

వీడియో షేర్ చేస్తూ.. ఎవరైనా హృదయంలో స్థానం ఇస్తే, అక్కడ శాశ్వతంగా జీవిస్తారని చెబుతారు. మీరు నాపట్ల చూపిన ప్రేమ, ఆదరణ నా హృదయాన్ని నింపేసింది. పిర్‌పైంటి, కహల్‌గావ్‌కు సాదర స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వెల్లడించింది. 

గతంలో నేహా శర్మ రాజకీయాల్లోకి రావచ్చని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల అరంగేట్రం చేయడం లేదని పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఆమె తండ్రి అజిత్ శర్మ ఆమెకు రాజకీయాల్లో చేరే అవకాశాన్ని అందించినప్పటికీ.. ఆమె ప్రస్తుతం తన నటనా వృత్తిపై దృష్టి పెట్టినట్లు నివేదికలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement