'కేసీఆర్‌ పాతబస్తీ మిత్రునికి సలాం కొడుతున్నారు'

Sambit Patra Fires On KCR At Hyderabad  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కూర్చొని పాతబస్తీ మిత్రునికి సలాం కొడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ధ్వజమెత్తారు. ‘మీకు బీజేపీ మేయర్‌ కావాలా..? ఎంఐఎం మేయర్‌ కావాలా..?. కాంగ్రెస్‌కు ఓటువేస్తే టీఆర్‌ఎస్‌కి వేసినట్లే.. టీఆర్‌ఎస్‌కి వేస్తే ఎంఐఎంకు పోతాది’ అంటూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంబిత్‌ పాత్ర  శనివారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.   (బండి సంజయ్‌, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు)

కుటుంబ పాలన సాగుతోంది..
'భాగ్యనగరానికి రావడం నా అదృష్టం. భాగ్యనగరం ఒక కుటుంబానికే పరిమితమయ్యింది. ఇది నిజంగా దౌర్భాగ్యం. భాగ్యనగర్‌ అన్నందుకు రెండు రోజుల క్రితం యువరాజు కేటీఆర్‌ చాలా బాధపడ్డాడు. బాధ దేనికి హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మార్చొద్దా..?. ఇక్కడ కుటుంబ పాలన సాగుతోంది. ఫ్యామిలీ ఫ్రెండ్‌ పాలన ఇది. దుబ్బాకలో కేసీఆర్‌ నివాసం ఉంది. అక్కడ బీజేపీ గెలిచింది. సర్కార్‌ కాదు. కార్‌కి పంక్చర్‌.. సర్‌ ఫామ్‌ హౌస్‌కి పరిమితం. ఏనాడు భారత్‌ అనని ఒవైసీని గెలిపిస్తే హిందూస్తాన్‌ను మార్చేస్తారు. సెప్టెంబర్‌ 17ను అధికారికంగా ఎందుకు నిర్వహించరు..?.

భాగ్యలక్ష్మి గుడికి తాళాలు వేశారు. అంటే పాతబస్తీ వేరే దేశంలో ఉందా.. వీసా తీసుకొని రావాలా..?. పాతబస్తీలోకి రావాలంటే ఎంఐఎం అనుమతి కావాలా..?. అలాంటి వాళ్లకు బుద్ది చెప్పాలి. అందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లన్నారు. పట్టుమని ఇప్పటిదాకా 1,500 మందికి రాలేదు. ఇలా అయితే 50 ఏళ్లకు అయినా ఇళ్లు రావు. ప్రగతి భవన్‌లో అపరిమితంగా బెడ్‌రూమ్‌లు. సాధారణ జనాలకు మాత్రం ఇళ్లు లేవు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద దేశవ్యాప్తంగా ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. ఇక్కడ మాత్రం కేసీఆర్‌ ఇవ్వడం లేదు. కనీసం ఇటుక ఇవ్వలేదు. ఫొటోల కోసమే కేటీఆర్‌ వరదల్లో ఫోజులిచ్చారు. గ్లోబల్‌ హైదరాబాద్‌ను వరదల్లో ముంచారు. మీ కబ్జాల వల్ల 80 మంది మరణించారు. వరద సాయం పెద్ద స్కామ్‌. అందరూ ఎన్నికల్లో ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి' అని జీహెచ్‌ఎంసీ ఓటర్లను సంబిత్‌ పాత్రా కోరారు.    (బీజేపీలో చేరిన విక్రం గౌడ్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

22-01-2021
Jan 23, 2021, 19:18 IST
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌ ఎన్నిక ఫిబ్రవరి 11న జరగనుంది.
09-12-2020
Dec 09, 2020, 08:29 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్​మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ముగిసింది.
08-12-2020
Dec 08, 2020, 08:28 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎక్కడైనా గెలుపు, ఓటములు ఉంటాయి. గెలుపులోనూ చాలా చోట్ల ఒకటి, రెండో, మూడో స్థానాలుంటాయి. ఎన్నికల్లో మాత్రం ఒక్కటే...
08-12-2020
Dec 08, 2020, 08:04 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా నేరేడ్‌మెట్‌ డివిజన్‌ ఓట్ల లెక్కింపునకు అడ్డంకి తొలగింది.
08-12-2020
Dec 08, 2020, 07:57 IST
సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ పీఠంపై యువరక్తం కొలువు దీరనుంది. రాజకీయ కుటుంబ నేపథ్యంతో కొంతమంది బరిలోకి దిగితే.. సమాజసేవపై ఆసక్తితో మరికొంత...
08-12-2020
Dec 08, 2020, 04:54 IST
మిషన్‌– 2023 లక్ష్యంగా కమలనాథులు శరవేగంగా వ్యూహరచన చేస్తున్నారు.
07-12-2020
Dec 07, 2020, 15:22 IST
సాక్షి, హైదరాబాద్‌: నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితం వెల్లడికి అడ్డంకి తొలగింది. నేరేడ్‌మెట్‌ కార్పొరేటర్‌ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు...
07-12-2020
Dec 07, 2020, 08:45 IST
సాక్షి, హైదరాబాద్‌: మజ్లిస్‌ ఎన్నికల బరిలో లేని డివిజన్లలో సంప్రదాయ ఓటు బ్యాంక్‌ సైలెంట్‌గా టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసింది. మజ్లిస్‌పై మాటల...
07-12-2020
Dec 07, 2020, 08:09 IST
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులు పరాజయం పాలయ్యారు.
06-12-2020
Dec 06, 2020, 12:28 IST
సాక్షి, రంగారెడ్డి: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలు...
06-12-2020
Dec 06, 2020, 10:43 IST
సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల్లో ముషీరాబాద్‌ నియోజవకర్గంలో కారు స్పీడుకు బ్రేక్‌ పడింది. అడిక్‌మెట్‌ డివిజన్‌లో సిట్టింగ్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిని మార్చకపోవడం, ఇన్‌చార్జిగా వ్యవహరించిన...
06-12-2020
Dec 06, 2020, 08:25 IST
జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎంపికలో ‘మజ్లిస్‌’ పాత్ర కీలకంగా మారింది. దాదాపు 30 శాతం సీట్లు దక్కించుకున్నఎంఐఎం మద్దతుపైనే మేయర్‌ ఎన్నిక...
06-12-2020
Dec 06, 2020, 03:37 IST
ప్రెస్‌వాళ్లు వచ్చి కూర్చున్నారు.  తెలంగాణలో బీజేపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి ఆ సీఎం పెట్టిన ప్రెస్‌ మీట్‌కు వచ్చినట్లుగా...
06-12-2020
Dec 06, 2020, 03:27 IST
హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు రెండు కీలకమైన రాజకీయ పరిణామాలకు అద్దంపట్టే విధంగా ఉన్నాయి. ఒకటి: అధికారంలో ఉన్న...
06-12-2020
Dec 06, 2020, 03:07 IST
సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్‌ గుర్తు కాకుండా నిర్దిష్టమైన ఇతర గుర్తులున్నా వాటినీ లెక్కించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌...
06-12-2020
Dec 06, 2020, 02:54 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ ఒక్కపార్టీకీ స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో మేయర్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మేయర్‌ ఎన్నిక...
06-12-2020
Dec 06, 2020, 02:42 IST
సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై హడావుడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవస రంలేదని ఎంఐఎం అధినేత...
06-12-2020
Dec 06, 2020, 02:02 IST
సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాలు గెలుచుకున్నా.. గతంతో...
05-12-2020
Dec 05, 2020, 18:42 IST
సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్లు నడిచిందని బీజేపీ...
05-12-2020
Dec 05, 2020, 16:44 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదని కాంగ్రెస్‌ శాసనసభ పక్షనేత భట్టి విక్రమార్క స్పష్టం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top