భూములు ఆక్రమించొద్దు | - | Sakshi
Sakshi News home page

భూములు ఆక్రమించొద్దు

Jun 25 2026 6:05 AM | Updated on Jun 25 2026 6:05 AM

పెద్దపల్లి: ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్ర మ పట్టాలు, భూ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటాని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. ముత్తారం మండలం పోతారం, మైదంబండలోని ప్రభుత్వ భూములపై అక్రమంగా సృష్టించిన పట్టాలపై విచారణ చేశామన్నారు. పోతారంలోని సర్వే నంబరు59లో 19.01 ఎకరాలు, మైదంబండలోని సర్వే నంబరు 113లో 11.02 ఎకరాలు ప్రభుత్వ భూములుగా నిర్ధారణ అయినట్లు, పట్టాలను రద్దు చేసి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీచేశామని కలెక్టర్‌ వివరించారు.

వైభవంగా ఎల్లమ్మ పట్నాలు

ఎలిగేడు: లాలపల్లి గౌడసంఘం బుధవారం ఎల్లమ్మ పట్నాలు వైభవంగా నిర్వహించింది. ప్రభుత్వ విప్‌ విజయరమణారావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, పెద్ది కుమార్‌, గౌడసంఘం నాయకులు పాల్గొన్నారు.

విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు

కాల్వశ్రీరాంపూర్‌: రజకుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బుధవారం మడేలేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారికి రజకులు జలాభిషేకం చే శారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్‌, మాజీ జెడ్పీటీసీలు వంగళ తిరుపతిరెడ్డి, లంక సద య్య, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

నేడు మార్కెట్‌ బంద్‌

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలోని జెండాకూ డలి ప్రధాన కూరగాయల మార్కెట్‌ను గురువారం మూసి ఉంచుతున్నట్లు అసోసియేషన్‌ నాయకులు తెలిపారు. కూరగాయల వ్యాపారి మరణించినందుకు సంతాప సూచకంగ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని వారు కోరారు.

‘ప్రయోజనం లేని మేళాలు’

పెద్దపల్లిరూరల్‌: రాష్ట్రప్రభుత్వం రైతుసంక్షేమా న్ని పట్టించుకోవడం లేదని మాజీ వైస్‌ఎంపీపీ ముత్యాల రాజయ్య విమర్శించారు. రైతువేదికల్లో విత్తన మేళాలను ఎందుకు నిర్వహిస్తున్నా రని ప్రశ్నించారు. వ్యాపారులు, డీలర్లే విత్తనా లను నామమాత్రంగా ప్రదర్శించడం ద్వారా ఎవరికి ప్రయోజనం కలుగుతుందని నిలదీశా రు. కనీసం శాస్త్రవేత్తలను పిలిపించి సాగుపై అవగాహన కల్పించాలని డిమాండ్‌ చేశారు.

కేకేనగర్‌లో పీరీల ఊరేగింపు

యైటింక్లయిన్‌కాలనీ: మొహర్రం వేడుకను పురస్కరించుకొని వెంకట్రావుపల్లి కేకేనగర్‌లో బుధవారం పీరీలను ఊరేగించారు. భక్తులు కుడుకలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

దరఖాస్తులు ఆహ్వానం

పెద్దపల్లి: అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ జస్టిస్‌లో మూడేళ్ల శిక్షణ కోసం షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన అర్హత కలిగిన లా పట్టభద్రుల నుంచి ఆన్‌లైన్‌లో దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కు లాల అభివృద్ధి అధికారి రవీందర్‌ తెలిపారు. ఈనెల 20 నుంచి జూలై 31 వరకు ఈ పాస్‌ వె బ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. వివరాలకు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం, కలెక్టర్‌ కాంప్లెక్స్‌, మొ దటి అంతస్తు, గది నంబరు 232లో సంప్రదించాలని ఆయన సూచించారు.

డ్రగ్స్‌ రహిత సమాజం లక్ష్యం

ధర్మారం: విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించా రు. స్థానిక మోడల్‌ స్కూల్‌లో బుధవారం మ త్తు పదార్థ్దాలతో తలెత్తే దుష్పరిణాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్‌ రహిత సమాజం కోసం అందరూ పాడుపడా లని సూచించారు. సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై ప్రవీణ్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement