పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: మన దేశం యోగాకు పుట్టినిల్లు.. యోగా వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం ప్రాప్తిస్తుందని, ప్రతీ మనిషి తమ జీవితంలో యోగాభ్యాసనాలను ఓ భాగంగా చేసుకోవడం మేలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఆదివారం ఆయుష్ ఆధ్వర్యంలో యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే అంశంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్యతో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు యోగాసనాలు చేశారు. యోగసనాలు వేయడం వల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుందన్నారు. ఇది వ్యాయామంగానే కాకుండా మానసికస్థైర్యాన్ని పెంపొందిస్తుందన్నారు. డీఎంహెచ్‌ఓ ప్రమోద్‌కుమార్, డీసీపీ రాంరెడ్డి, ఆయుష్ అధికారి అరుణ, మారుతి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
యోగా నిత్యజీవితంలో భాగం కావాలి
గోదావరిఖని: యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా అరు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో మాట్లాడారు. యోగా ఒకరోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతిఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాల్సిన ఆరోగ్య సాధనమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్రగౌడ్, గోదావరిఖని వన్‌టౌన్ రెండో సీఐ అఫ్జలోద్దీన్, రామగుండం సీఐ కృష్ణకుమార్, ఆర్‌ఐలు దామోదర్, మల్లేశం, శేఖర్, రమేశ్, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ యోగా శిక్షకురాలు రాధిక పాల్గొన్నారు.


