సర్వం నాన్నే! | - | Sakshi
Sakshi News home page

సర్వం నాన్నే!

Jun 21 2026 8:16 AM | Updated on Jun 21 2026 8:16 AM

● పిల్లల తొలి స్నేహితుడు తండ్రి ● ఎంతో మందికి మార్గదర్శి ● కష్టాల్లో తోడుంటూ.. నీడగా వెంటుంటూ.. ● నేడు ఫాదర్స్‌ డే

నాన్న.. రెండక్షరాల ఈ పదం ప్రతీ వ్యక్తికి గుండె ధైర్యం.. ప్రపంచాన్ని జయించేంత మనో నిబ్బరం.. అమ్మ లోకానికి పరిచయం చేస్తే.. నాన్న ప్రపంచాన్ని చూపిస్తాడు. మనం భూమిపై పుట్టాక పరిచయమయ్యే తొలి స్నేహితుడు నాన్న.. జీవిత పాఠాలు బోధించే తొలి గురువు నాన్న.. బుడిబుడి అడుగులు వేసే సమయంలో ఎక్కడ పడిపోతామోనని భయపడుతూ.. వెన్నంటే ఆయన వేసే అడుగులు మనం లైఫ్‌లో స్థిరపడే వరకూ ముందుండి నడిపిస్తాయి. నాన్న ఎన్నో కష్టాలు పడుతూ.. పిల్లల సంతోషం కోసం అన్నీ త్యాగం చేస్తాడు. పిల్లలు జీవితంలో ఎక్కే ప్రతీ మెట్టులో నీడలా వెన్నంటే ఉంటాడు. కుటుంబ సంతోషం కోసం ఎన్ని కష్టాలైనా ఒంటెద్దు బండిలా లాగుతూ.. పిల్లల ముఖంలో నిత్యం చిరునవ్వులు చూస్తూ సంతోషించే వ్యక్తి నాన్న.. నాన్న అంటే భయపడే రోజు నుంచి స్నేహితుడిగా అన్నీ పంచుకునే కాలంలో చాలా మంది ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు ఫాదర్స్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనాలు..!!

తల్లిదండ్రులతో

శశాంక్‌

గద్దె శ్రీచరణ్‌, ఎవల్‌ఫినిటీ

టెక్నాలజీస్‌ కంపెనీ వ్యవస్థాపకుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement