కల్తీ విత్తనాలపై ప్రత్యేక దృష్టి నాసిరకం ఎరువుల విక్రయాల కట్టడికి కార్యాచరణ విక్రయదారులపై పీడీ యాక్ట్ కేసులు ప్రకటనలతో మోసపోవద్దు, రసీదు తప్పనిసరి కొనుగోళ్లలో జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన Ðé¯é-M>ÌS… ïÜf¯ŒSMýS$ {糿¶æ$™èlÓ… ç³MýSyýl¾…© ^èlÆý‡ÅË$ ో
సాక్షి పెద్దపల్లి:
వానాకాలం సాగుకు సమయం ఆసన్నమైంది. జిల్లాలో 2,78,290 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. రోహిణి కార్తెలో దుక్కులు దున్నడం వంటి పనులు చేస్తూ సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ సీజన్‌లో చా లామంది పత్తి, మొక్కజొన్న, వరి అధికంగా సాగు చేస్తుంటారు. ఇదేసమయంలో అనుమతి లేనివిత్తనాలు, బీటీ–3 విత్తనాలు, నకిలీ విత్తనాలను వ్యాపారులు మార్కెటింగ్ చేసుకోవడానికి రంగంలోకి దిగారు. రంగురంగుల ప్యాకెట్లలో నింపి రైతులకు అంటగట్టే పనిలోపడ్డారు. పల్లెల్లో స్థానికులను ఏజెంట్లుగా నియమించి నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. కంపెనీ పేరు, చిరునామా లేకుండా మంచివని, అధిక దిగుబడి ఇస్తాయని నమ్మబలుకుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎ రువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
టాస్క్‌ఫోర్స్ బృందాలతో
అన్నదాతలను నిండా ముంచుతున్న నకిలీ విత్తనాలు, ఎరువుల వ్యాపారులపై టాస్క్‌ఫోర్స్, పోలీసులు, వ్యవసాయశాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు చేస్తున్నారు. మండలానికో టాస్క్‌ఫోర్స్ కమిటీ చొప్పున ఏర్పాటు చేసి.. వ్యవసాయ, పోలీ సు అధికారులు, సీడ్ సర్టిఫయింగ్ ఆఫీసర్ (ఏసీసీవో) ఉండనున్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు తేలితే బాధ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అధికారులు దాడులు చేస్తున్నా..
ప్రతీసీజన్‌లో అధికారులు దాడులు చేస్తున్నా కొంద రు డీలర్లు అధిక డబ్బుకు ఆశపడి నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తున్నారు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు డీలర్లందరూ క్రయవిక్రయాలు, స్టాక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, ప్యాకెట్లపై తయారీ, మొలకశాతం, జన్యు స్వచ్ఛత తదితర విషయాలను పరిశీలించాలని అధికారులు అన్నదాతలకు సూచిస్తున్నారు.
విత్తన ఎంపికలో జాగ్రత్త..
లైసెన్స్‌డ్ డీలర్ల నుంచే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాలని, డీలర్ల సంతకంతో కూడిన రసీదు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన తేదీ, విత్తన రకం, పరిమాణం, ధర, లాట్ నంబర్ తదితర వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయించుకుని సరిచూసుకోవాలని సలహా ఇస్తున్నారు. రంగు రంగుల ప్యాకెట్లను చూసి మోస పోవద్దని, కంపెనీ విశ్వసనీయత, విత్తనాల నాణ్య త, మొలక శాతం వివరాలను పరిశీలించుకోవాలని వివరిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసి సాగు చే సిన తర్వాత ఖాళీ విత్తనాల సంచులను పంట చేతికొచ్చే చివరిదశ వరకు జాగ్రత్తగా భద్రపరచాలని సూచిస్తున్నారు. సీజన్ ప్రారంభం అవుతుండడంతో కొందరు బిల్లులు లేకుండా తక్కువ ధరలకు వి త్తనాలు అమ్ముతుంటారని, వారిపై వ్యవసాయ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. విత్తన మార్కెట్‌ను పెంచడం, అధికంగా విత్తనాలు అమ్మకం కోసం వివిధ కంపెనీలు వ్యాపారులకు బహుమతులు, టూర్లు ఆఫర్లను ప్రకటిస్తుండడంతో పలువురు వ్యాపారులు, డీలర్లు నకిలీ వ్యాపారం వైపు మొగ్గుచూపే అవకాశాలుంటాయని, అప్రమత్తంగా ఉండాలని వివరిస్తున్నారు.
జిల్లా సమాచారం
డీలర్లు 350
సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 6
సబ్సిడీ విత్తన విక్రయ కేంద్రాలు 51
సాగు విస్తీర్ణం(ఎకరాల్లో) 2,78,290
కఠిన చర్యలు తప్పవు
జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలి. జిల్లాలో నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నట్ల మా దృష్టికి వస్తే పీడీ యాక్ట్ ప్రయోగించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటాం. ఈవిషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి.
– శ్రీనివాస్, డీఏవో


