నిర్వాసితులతో సమావేశం | - | Sakshi
Sakshi News home page

నిర్వాసితులతో సమావేశం

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

రామగిరి: సింగరేణి ఆర్జీ–3 ఓసీపీ–2 విస్తరణ కో సం 2015లో అక్కేపల్లి, లద్నాపూర్‌, రచ్చపల్లిలో భూసేకరణ కోసం అవార్డు పాస్‌ చేశారు. కొందరు రైతులు మెరుగైన పరిహారం కోసం హైకోర్టుకు వెళ్లా రు. ఈమేరకు శుక్రవారం సెంటినరీకాలనీ సీఎన్‌సీవోఏ క్లబ్‌లో లోక్‌ అదాలత్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. రెండు గ్రామాల నుంచి రైతులు, సర్పంచులు, న్యాయవాదులు హాజరై మెరుగైన పరిహారం చెల్లింపుపై చర్చించారు. కమిటీ చైర్మన్‌, సింగరేణి ఎస్టేట్స్‌ జనరల్‌ మేనేజర్‌ లక్ష్మీపతిగౌడ్‌ అధ్యక్షత వ హించారు. కోర్టు ఆదేశాల మేరకు మెరుగైన పరిహా రం అందిస్తామని, సమస్య పరిష్కారమయ్యేలా ని ర్వాసితులు సహకరించాలని కోరారు. ఆర్జీ–3 జీ ఎం మధుసూదన్‌, ఫైనాన్స్‌ జీఎం శ్రీనివాసులు, లా డీజీఎం శిరీషరెడ్డి, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌, ఫైనాన్స్‌ డీజీఎం సురేఖ, ఎస్టేట్స్‌ అధికారులు తేజా వత్‌ హీర్యా, శ్రీనివాస్‌, ఐలయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement