పెద్దపల్లిరూరల్: పర్యావరణాన్ని కాపాడుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని అ దనపు జిల్లా జడ్జి స్వప్నరాణి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్ర వారం జిల్లా కోర్టు సముదాయంలో జూనియర్ జడ్జి మంజులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒక్కరు తమవంతుగా సహకరించాలని జడ్జి సూచించారు.
విరివిగా మొక్కలు నాటాలి
పెద్దపల్లి: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి గణేశ్ కోరారు. కోర్టులో జడ్జి మొక్కలు నాటి మాట్లాడారు. సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వొడ్నాల రవీందర్, ప్రధాన కా ర్యదర్శి ఆవు నూరి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ ఆవుల శివకృష్ణ, ఏజీపీ ఆంజనేయులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ సప్లిమెంటరీ ప్రశాంతం
పెద్దపల్లి: జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ స ప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతు న్నాయని డీఈవో శారద శుక్రవారం తెలిపారు. తెలుగు పరీక్షకు 43 మందికి 33 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో పేర్కొన్నారు.
మైనర్లకు వాహనాలివ్వొద్దు
పెద్దపల్లిరూరల్: రోడ్డు భద్ర త నియమాలు పాటించాలని, ముఖ్యంగా మైనర్లకు వా హనాలు ఇవ్వొద్దని ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ అన్నారు. తమ పిల్లలకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రమాదాల నియంత్రణకు రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించాలనే విషయమై అరైవ్.. అలైవ్ పేరిట అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మద్యం మత్తులో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారకులు కావొద్దని ఆయన సూచించారు.
ఘనంగా మాస కల్యాణం
కమాన్‌పూర్: ప్రసిద్ధ శ్రీఆదివరాహస్వామి స న్నిధిలో శుక్రవారం మాస కల్యాణం వైభవంగా జరిపించారు. భక్తులు భారీ సంఖ్యలో తర లివచ్చారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమి టీ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఈవో కాంతారెడ్డి, డైరెక్టర్ తీగల రాజయ్య పాల్గొన్నారు.
రేపు బీఆర్‌ఎస్ సమావేశం
పెద్దపల్లి: బీఆర్‌ఎస్ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ఈనెల 7 వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపా రు. మధ్యాహ్నం 2 గంటలకు రంగంపల్లి మె యిన్ రోడ్డులోని తిరుమల గార్డెన్‌లో నిర్వహించనున్నామని, మాజీ మంత్రి హరీశ్‌రావు ము ఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. పార్టీ బలో పేతం, భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
సమస్యలు పరిష్కరిస్తాం
ఫెర్టిలైజర్‌సిటీ: చైతన్యపురిని సమస్యల రహిత కాలనీగా తీర్చిదిద్దుతామని రామగుండం మే యర్ మహంకాళి స్వామి అన్నారు. 22వ డివిజన్ చైతన్యపురి కాలనీలో ఆయన శుక్రవారం స్వామి పర్యటించారు. మురుగునీటి కాలువల్లో చెత్త తొలగింపు పనులు పరిశీలించారు. కా ర్యక్రమంలో కార్పొరేటర్లు కన్నూరి భాగ్యలక్ష్మి, వడ్లూరి రవి, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వా మి, నాయకుడు సతీశ్ పాల్గొన్నారు.
సామర్థ్యం మెరుగుపర్చుకోవాలి
గోదావరిఖని: నేర పరిశోధనలో నైపుణ్యం, కచ్చితత్వం పెంపు కోసం దర్యాప్తు సామర్థ్యా న్ని మెరుగుపర్చుకోవాలని అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం రా మగుండం పోలీస్‌కమినరేట్‌లో ఏర్పాటు చేసి న సమావేశంలో మాట్లాడారు. సాంకేతిక పరి జ్ఞానానికి అనుగుణంగా నేరాలను త్వరితగతి న ఛేదించేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.


