అవయవదానంపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

అవయవదానంపై అవగాహన

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

‘రక్తదానం చేయండి.. ప్రాణదాతలు అవ్వండి.. అవయవదానం చేయండి.. మరోసారి జీవించండి.. శరీరదానం చేద్దాం.. వైద్యవిద్య అధ్యయనానికి చేయూతనిద్దాం.. బ్రెయిన్‌ డెడ్‌ అయితే అవయదానం చేసి పునర్జన్మనివ్వండి’ ఇలాంటి నినాదాలు బాగానే ఉన్నా ఆచరణకు నోచుకోవడంలేదు. మనిషి తలరాత ఎలా ఉన్నా.. గోడలపై రాతలతోనైనా మనుషుల్లో పరివర్తన వస్తుందని అవయవదానంపై అవగాహనకు శ్రీకారం చుట్టింది రామగుండం మున్సిపాలిటీ. ప్రమాదవశాత్తు మరణించిన వారి శరీరదానాలు, అవయవ దానాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ గోదావరిఖని జనరల్‌ ప్రభుత్వ ఆస్పత్రి(జీజీహెచ్‌) పోస్ట్‌మార్టం గోడలపై బొమ్మలు గీసి చైతన్య పరచడం ‘సాక్షి’ కెమెరాకు కళారూపంలో కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

Advertisement
 
Advertisement
Advertisement