మూడు రోజుల్లో ధాన్యం తరలింపు పూర్తి | - | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో ధాన్యం తరలింపు పూర్తి

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

● ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం పూర్తయినా.. గోదాముల తరలింపులో అక్కడక్కడా కొంత జాప్యం జరిగిందని, మూడురోజుల్లోగా తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. పట్టణ శివారు చీకురాయిరోడ్డులోని గోదాములో ధాన్యం నిల్వలను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ సమస్య పెద్దపలి, కాల్వశ్రీరాంపూర్‌ మండలాల పరిధిలోనే ఉందన్నారు. ధాన్యం తరలింపు కోసం అవసరమైన లారీలు, హమాలీల కొరతను అధిగమించేందుకు అధికారులు సహకరించాలని కోరారు. మొక్కల కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిందని, రైతుల ఖాతాకు డబ్బులు సైతం జయచేశామని తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, లారీ అసోసియేషన్‌ నాయకులు అబ్దుల్‌బారీ, తిరుపతి, శ్రీనివాస్‌, సతీశ్‌, సీఐలు ప్రవీణ్‌, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలి

కాల్వశ్రీరాంపూర్‌: పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు ఆకాంక్షించారు. గంగారం గ్రామంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో ఆయన ప్రత్యేక ప్రత్యేకపూజలు చేశారు. ముదిరాజ్‌ కులస్తులు ఆయనను శాలువాలతో సన్మానించారు. సర్పంచ్‌ రేకుల జ్యోతి, ఉప సర్పంచ్‌ మేడి అశోక్‌గౌడ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, ముదిరాజ్‌ కులస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement