పర్యావరణ పరిరక్షణకు పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణకు పురస్కారాలు

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

ఎలిగేడు: పర్యావరణ పరిరక్షణలో ఉత్తమ పనితీరు ప్రదర్శించిన సుల్తాన్‌పూర్‌ గ్రామపంచాయతీకి రాష్ట్రప్రభుత్వం అవార్డు ప్రకటించగా.. శుక్రవారం హైదరాబాద్‌లో సర్పంచ్‌ కవ్వంపల్లి బాపయ్య, పంచాయతీ కార్యదర్శి జూపాక శివకుమార్‌ పురస్కా రం అందుకున్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ రాష్ట్రసాయిలో ఉత్తమంగా ఎంపికై న విషయం విదితమే. ఈమేరకు హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, అతిథుల నుంచి వారు అవార్డు అందుకున్నారు. ఉపర్పంచ్‌ తానిపర్తి రమేశ్‌రావు, వా ర్డు సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఎన్టీపీసీ ధన్వంతరి ఆస్పత్రికి..

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ ధన్వంతరి ఆస్పత్రి పర్యావ రణ అవార్డు అందుకుంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పద్ధతులకు చేసిన కృషికి గుర్తింపుగా ఎన్టీపీసీ – తెలంగాణ ప్రాజెక్టుకు చెందిన ధన్వంతరి ఆస్ప త్రి నిర్వాహకులను కాలుష్య నియంత్రణ మండలి అవార్డుతో సత్కరించారు. మంత్రి కొండా సురేఖ ఈ పురస్కారాన్ని డాక్టర్‌ లహరికి అందజేశారు. వైద్యులను, సిబ్బందిని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత అభినందించారు.

అవార్డు అందుకున్న సుల్తాన్‌పూర్‌ సర్పంచ్‌

ధన్వంతరి ఆస్పత్రికి కూడా పురస్కారం

Advertisement
 
Advertisement
Advertisement