వర్షం కురిసింది.. తూకం ఆగింది | - | Sakshi
Sakshi News home page

వర్షం కురిసింది.. తూకం ఆగింది

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

కాల్వశ్రీరాంపూర్‌: రోహిణి కార్తెలో వర్షాలు కురుస్తాయని, ధాన్యం త్వరగా తూకం వేసి రైస్‌మిల్లులకు తరలించాలని అన్నదాతలు నెత్తీనోరు బాదుకున్నా అధికారులు, నిర్వాహకులు నిర్లక్ష్యం చేశారు. రైతులు భయపడినట్లే గురువారం సాయంత్రం హఠాత్తుగా కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఆయా ప్రాంతాల్లో బురద పేరుకుపోవడంతో లారీలు వెళ్లలేకపోయాయి. దీంతో శుక్రవారం ధాన్యం తూకం ఆగిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచక రైతులు అయోమయంలో పడ్డారు.

ధాన్యం కుప్ప నుంచి వర్షపు నీటిని తొలగిస్తున్న రైతు

కూనారంలో వరదనీటిలో కొట్టుకు పోయిన ధాన్యం

Advertisement
 
Advertisement
Advertisement