పీక్కతింటున్నాయి | - | Sakshi
Sakshi News home page

పీక్కతింటున్నాయి

Apr 22 2026 9:36 AM | Updated on Apr 22 2026 9:36 AM

జిల్లాను వణికిస్తున్న వీధికుక్కలు

ఎండలతో ఇరిటేషన్‌

వణికిపోతున్న చిన్నారులు, వృద్ధులు

పదుల సంఖ్యలో ఆస్పత్రులకు బాధితుల పరుగులు

ఇటీవల చోటుచేసుకున్న కేసులు

కుక్క కరిస్తే వెంటనే ఏం చేయాలి?

కుక్కకాటు రెండు రకాలులు..

నిర్లక్ష్యం చేయొద్దు

సాక్షి పెద్దపల్లి: గ్రామ సింహాలు ఒకప్పుడు అపరిచితులు, దొంగలపాలిట సింహస్వప్నంగా ఉండేవి. మారిన పరిస్థుతుల దృష్ట్యా పిల్లలు, వృద్ధులపాలి ట మృత్యుమృగాలుగా మారుతున్నాయి. జిల్లావ్యాప్తంగా దడ పుట్టిస్తుండగా.. బాధితులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దొరికిన వారిని దొరికినట్లు కరిచేస్తున్నాయి. దీనికితోడు వేసవికావడంతో ఇరిటేషన్‌ పెరిగి ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. రోజూ కనీసం పదుల సంఖ్యలో బాధితు లు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. గత జ నవరిలో 831, ఫిబ్రవరిలో 779, మార్చిలో 684 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి.

అత్యధిక ఉష్ణోగ్రతలతో..

జిల్లాలో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుక్కల్లో విపరీతమైన ఇరిటేష న్‌ వచ్చి, దాహం ఎక్కువై స్వైరవిహారం చేస్తున్నా యని వైద్యులు చెబుతున్నారు. ఆగ్రహంతో ఎవరు కనిపించినా దాడి చేసేందుకు యత్నిస్తున్నాయి. సౖ రెన సమయంలో ఆహారం, నీళ్లు దొరక్క ఇలా వ్యవహరిస్తున్నాయి. ప్రధానంగా పిల్లలపై అధికంగా ప్రతాపం చూపుతున్నాయి.

మాంసానికి అలవాటు పడి..

జీవవ్యర్థాలు, వృథా ఆహారం ఎక్కువగా లభించే ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉంది. ఫంక్షన్‌ హాల్స్‌, మటన్‌, చికెన్‌ షాపుల వద్ద వ్యర్థాలను తి నేందుకు అలవాటుపడ్డాయి. ఆహారం లభించనప్పుడు జనావాసాల వైపు వస్తున్నాయి. ఆ సమయంలో చేతిలో సంచితో వెళ్లే ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. వాటిని ప్రతిఘంటించలేక అనేకమంది తీవ్రంగా గాయపడుతున్నారు. మాంసానికి అల వాటు పడిన కుక్కలు మేకలు, గొర్రెల మందలపై కూడా దాడులు చేసి పీక్కుతింటున్నాయి.

స్టెరిలైజేషన్‌ లేక..

2019 పశుగణన ప్రకారం జిల్లాలో సుమారు 4 వే ల కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు మ ళ్లీ గణన చేపట్టలేదు. ప్రస్తుతం వీటిసంఖ్య రెట్టింపైనట్లు అంచనా. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. వీధికుక్కలకు స్థానిక సంస్థల అధికారు లు రేబిస్‌ టీకాలు వేయించాలి. సంతాన నియంత్ర ణ ఆపరేషన్లు చేయించాలి. అవేవీ అమలుకు నోచుకోవడం లేదు. కుక్కలను యానిమల్‌ బర్త్‌ కంట్రో ల్‌ కేంద్రాలకు తరలించి శస్త్రచికిత్సలు చేసి వదిలేయాలి. అనారోగ్యంతో ఉన్న, రేబిస్‌ సోకిన వాటిని గుర్తించి చికిత్స అందించాలి. నిధుల కొరతతో వీటిని పట్టించుకునేవారు కరువయ్యారు.

07 మార్చి : రామగుండం కార్పొరేషన్‌ 39వ డివిజన్‌ కార్పొరేటర్‌ తిప్పారపు మానస కుమారుడు చార్విక్‌పై వీధికుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

18 ఏప్రిల్‌ : పెద్దపల్లి మండలం అందుగులపల్లిలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారితోపాటు మరో ఇద్దరిపై దాడిచేసి గాయపర్చాయి.

19 ఏప్రిల్‌ : సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్‌మిల్లులో పనిచేసేందుకు వచ్చిన ఒడిశా కార్మికుడి కూతురు దివ్వ బెహరా(3)పై కుక్కలు పాశవికంగా దాడి చేసి చంపేసి పీక్కుతిన్నాయి. జిల్లాలో పెరిగిన కుక్కల బెడదకు ఈ ఘటన అద్దం పడుతోంది.

కరిచినచోట తొలుత సబ్బుతో శుభ్రం చేసి ఆస్పత్రికి తరలించాలి.

తీవ్రతను బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు.

పెంపుడు కుక్కలు కరిస్తే ఇదివరకే టీకా వే యించారా?లేదా అనే విషయాలు పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు.

వీధికుక్కలు కరిస్తే కరిచిన భాగాలను బట్టి తప్పనిసరిగా ఇమ్యునోగ్లోబిన్‌, వ్యాక్సినేషన్‌ ఇచ్చి చికిత్స కొనసాగిస్తారు.

చిన్నారులు, వృద్ధులు వీటిబారిన పడే ఆస్కారం మరింత ఎక్కువ. బయటికి వెళ్లే తరుణంలో కర్రను తీసుకెళ్లడం ఉత్తమం.

కుక్కల ప్రవర్తనలో తేడా కనిపించినా, వాటి నోటినుంచి నురగలాంటిది వెలువడినా పిచ్చికుక్కగా గుర్తించి మున్సిపల్‌ అధికారులకు సమాచారం అందించాలి.

కుక్క కరిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. లేదంటే రేబిస్‌వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ప్రభు త్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తాం. ఇంటివద్ద, పనిప్రదేశాల్లో కుక్కలకు దూరంగా ఉండండి. పెంపుడు కుక్కలు సైతం ఇతరులను కరవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

– శ్రీధర్‌, డీసీహెచ్‌వో, పెద్దపల్లి

Advertisement
 
Advertisement
Advertisement