రామగుండం: అంతర్గాం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు మరోఅడుగు పడింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ప్రతినిధులు ఇచ్చిన ప్రీ ఫిజిబిలిటీ నివేదికపై కేంద్రప్రభుత్వం సానకూలంగా స్పందించడం ఇందుకు కారణమైంది. కేంద్ర పౌర విమానయానశాఖ సూచనలతో ఏఏఐ, వివిధ ప్రభుత్వ శాఖల అత్యున్నతస్థాయి ప్రతినిధులు గతేడాది డిసెంబరులో అంతర్గాంలో పర్యటించారు. ప్రభుత్వ స్థలాలు పరిశీలించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 11న రూ.40.53 లక్షలు కేటాయించింది.
ప్రతికూలంగా బసంత్‌నగర్..
ఏఏఐ ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తొలుత పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లోని స్థలాలు పరిశీలించారు. అక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు స్థలాలు అనుకూలంగా లేవని తేల్చారు. ఆ తర్వాతే ఏఏఐ అధికారులు అంతర్గాంలో పర్యటించి ప్రీ ఫిజిబిలిటీ నివేదిక రూపొందించారు. దీనిని కేంద్ర విమానయాన శాఖకు అందజేశారు. దీనిపై కేంద్ర విమానయాన శాఖ సానుకూలత వ్యక్తం చేస్తూ గత ఫిబ్రవరి 13న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై కేంద్ర విమానయానశాఖ తదుపరి చర్యలు తీసుకుంటుందని విశ్వసనీయ సమాచారం.
ప్రీ ఫిజిబిలిటీ నివేదికలో
పొందుపరిచిన ముఖ్యాంశాలు
రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే..
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా అంత ర్గాం ఎయిర్‌పోర్టుపై ముందడుగు పడనుంది. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తక్షణమే ఇక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు.. ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో భవన నిర్మాణాలు ఎన్నిఅంతస్తుల్లో నిర్మించే అవకాశం ఉంటుందనే దానిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
‘ప్రీ ఫిజిబిలిటీ’పై కేంద్ర ప్రభుత్వం సానుకూలత
ఇక మిగిలింది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే
అంతర్గాంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు మార్గం సుగమం!


