ఓటు వేయడమే నేరమా? | - | Sakshi
Sakshi News home page

ఓటు వేయడమే నేరమా?

Jan 21 2026 7:31 AM | Updated on Jan 21 2026 7:31 AM

ఓటు వేయడమే నేరమా?

ఓటు వేయడమే నేరమా?

పెద్దపల్లిరూరల్‌: రెండు పంచాయతీల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారని నోటీసులు అందడంతో భ యపడిన మొనారి రాధమ్మ(62) మంగళవారం ఎ స్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెద్దపల్లి మండలం రంగాపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రా యుధం.. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటరు జాబితాలో ఒకేచోట పేరు నమోదు చేసుకోలి. కానీ, కొందరికి ఒకటికి మించిన ప్రాంతాల్లో ఓటరుగా పేర్లు నమోదై ఉంటున్నాయి. రంగాపూర్‌ గ్రామానికి చెందిన మొనారి రాధమ్మకు కూడా రంగాపూర్‌ గ్రామ పంచాయతీతోపాటు సమీపంలోనే ఉన్న ఇదే జిల్లా కమాన్‌పూర్‌ మండలం గొల్లపల్లి పంచాయతీలోనూ ఓటరుగా పేరు

నమోదై ఉంది.

సమస్య ఏమిటంటే..

రంగాపూర్‌ సర్పంచ్‌ స్థానానికి తుదివిడత జరిగిన ఎన్నికల్లో ఒక్కఓటుతో పరాజయం పాలైన అభ్యర్థి ఒకరు.. తనను ఉద్దేశపూర్వకంగానే ఓడించారని, అధికారులు కూడా తన ప్రత్యర్ధికే సహకరించి ఒక్కఓటుతో విజయంసాధించినట్లు ప్రకటించారని ఆరోపించారు. వారి నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఇటీవల న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. దీంతో 15 రోజుల క్రితం ఒకటి, సోమవారం మరోనోటీసు అందుకున్న రాధమ్మ.. తనకు ఏమవుతుందోనని భయాందోళనకు గురైంది. నిరక్షరాస్యురాలైన వృద్ధురాలు.. పోలీస్‌ కేసు అవుతానని, జైలుపాలైతే ఎట్లా? అని తీవ్రంగా మనస్తాపం చెంది ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందంటున్నారు.

ప్రాణం తీసిన పంచాయతీ పోరు

ఒక ఓటు.. రెండు ఊళ్లు

రెండు ప్రాంతాల్లో ఓటువేసి.. నోటీసులతో మనస్తాపం చెంది..

రంగాపూర్‌లో వృద్ధురాలి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement