విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తేవాలి
ఎలిగేడు: విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకరావాలని టీజీఎన్‌పీడీసీఎల్ విద్యుత్ వినియో గదారుల చైర్మన్ వేణుగోపాలాచారి అన్నారు. బుధవారం ఎలిగేడు మండల కేంద్రంలోని 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో ఎలిగేడు, కాట్నపల్లి, సుల్తానాబాద్, కనుకుల సెక్షన్‌లకు సంబంధించి విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహించారు. పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు మార్చటం, వోల్టేజీ సమస్య, డిస్ట్రిబ్యూషన్ సిస్టం పెంపుదల, లోపాలున్న మీటర్లుమార్చడం వంటి సమస్యలపై రాతపూర్వకంగా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. టెక్నికల్ మెంబర్లు దేవేందర్, రమేశ్, ఇండిపెండెంట్ సభ్యుడు రామారావు, డీఈ రాజాబ్రహ్మాచారి, ఏడీ రామస్వామి, విద్యుత్ అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు.


