జలుబు.. దగ్గు.. జ్వరం!
జిల్లాలో పెరుగుతున్న జ్వరపీడితులు వాతావరణ మార్పులే కారణమంటున్న డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్న ఓపీ కిక్కిరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు
పెద్దపల్లి: వాతావరణంలో ఏర్పడిన మార్పులతో జి ల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు అకస్మాత్తుగా అనారోగ్యం పాలవుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరాలతో ఆసుపత్రుల బాట పడుతున్నారు. ప్రతీ ఇంటా జ్వర పీడితులు ఉంటున్నారు. పదిరో జులైనా తగ్గక పోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజురోజుకూ ఓపీ పెరుగుతుండగా, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వాతావరణ మార్పులు, అపరిశుభ్రతతో జ్వరాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
వాతావరణంలో మార్పులతోనే..
వాతావరణంగా చోటుచేసుకున్న అనూహ్య మార్పులతోనే ప్రజలు జ్వరం, దగ్గు, జలుబు, వాంతులకు గురవుతున్నారు. చలికాలంతో పాటు ఉదయం 11 గంటల వరకు ఈదురుగాలులతో సమస్యలు వస్తున్నాయి. అస్తమా, అలర్జీ, షుగర్ బాధితులతో పాటు చిన్న పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా ప్రభా వం పడుతోంది. సకాలంలో చికిత్సలు తీసుకోకపోతే ఇన్‌ఫెక్షన్‌కు గురై న్యూమోనియా బారిన పడే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఆస్పత్రులకు పెరుగుతున్న రోగుల తాకిడి
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సబ్ సెంటర్లు, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. కొందరికి తగ్గుతుండగా, మరికొందరికి తగ్గకపోవడంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి సిఫారసు చేస్తున్నారు. పెద్దపల్లి ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రోజూ వెయ్యికి పైగా ఓపీ నమోదవుతోంది.
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో
నమోదైన ఓపీ వివరాలు
జనవరి 19 1,230
జనవరి 20 1,331
జనవరి 21 1,367


