రైతులకు అందుబాటులో యూరియా సబ్‌సెంటర్
ఫెర్టిలైజర్‌సిటీ: రైతులకు అందుబాటులో ఉండేందుకు ఎక్కలపల్లిలో యూరియా సబ్‌సెంట ర్‌ను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ తెలిపారు. పాలకుర్తి మండలం ఎల్కలపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన యూరియా బ్రాంచ్ సబ్ సెంటర్‌ను బుధవారం ప్రారంభించి రైతులకు సబ్సిడీపై మంజూరైన వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఎల్కలపల్లి, గు ంటూరుపల్లి, లక్ష్మీపురం రైతులు యూరియా కోసం కన్నాల, కమాన్‌పూర్‌లకు వెళ్లి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఉండేదన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, ఎ ల్కలపల్లి సర్పంచ్ అంజిబాబు, జిల్లా వ్యవసా యాదికారి శ్రీనివాస్,నాయకులు పాల్గొన్నారు.
మంథని బస్టాండ్ పరిశీలన
మంథని: మేడారం జాతర కోసం మంథని బస్టాండ్‌లో చేసిన ఏర్పాట్లను బుధవారం టీఎస్‌ఆర్టీసీ డీవైఆర్‌ఎంలు భూపతిరెడ్డి, మల్లేశంలు పరిశీలించారు. ఈనెల 25నుంచి 31వరకు మేడారంకు మంథని పాయింట్ నుంచి 170 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. పెద్దలకు రూ.350, పిల్లలకు 210 చార్జి ఉంటుందని, ఈ బస్సుల్లో మహాలక్ష్మీ పథకం వర్తిస్తుందన్నారు. మంథని, మెట్‌పల్లి, వేములవాడ డీఎంలు శ్రావణ్‌కుమార్, సరస్వతి, శ్రీనివాస్, మంథని డిపో అసిస్టెంట్ మేనేజర్ ఏంజెల్, బస్టాండ్ ఎస్‌ఎం రవీందర్, కేకే రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
‘ఖని’ నుంచి మేడారం
జాతరకు బస్సు ప్రారంభం
గోదావరిఖనిటౌన్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు గోదావరిఖని నుంచి ప్రత్యేక బస్సులు ప్రారంభించినట్లు ఆర్టీసీ గోదావరిఖని డిపో మేనేజర్ ఎం.నాగభూషణం తెలిపారు. బుధవారం ఉదయం 5.30 గంటలకు, 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు బస్సులు బయలుదేరాయని అన్నారు. భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
బల్దియా అడిషనల్
కమిషనర్, సెక్రటరీ బదిలీ
కోల్‌సిటీ: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న మున్సిపాలిటీల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సొంత జిల్లాల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్లు, ఇతర మున్సిపల్ సి బ్బందిని బదిలీ చేస్తూ బుధవారం రాష్ట్ర ము న్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ డాక్టర్ టీకే.శ్రీ దేవి ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఏ.మారుతిప్రసాద్‌ను క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్‌గా, సెక్రటరీగా ఉన్న ఎం.ఉమామహేశ్వర్‌రావును ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆదిలా బాద్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సీవీఎన్ రాజును రామగుండం మున్సి పల్ కార్పొరేషన్ సెక్రటరీగా నియమించారు.
క్వింటాల్ పత్తి రూ.7,831
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,831 ధర పలికింది. కనిష్టంగా రూ.6,551గా, సగటు రూ.7,561గా ధర ఉందని మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. బుధవారం 501 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు వివరించారు.
చరిత్రను కాపాడాలంటూ మేధావులకు లేఖలు
మంథని: ఎంతో ప్రాముఖ్యం కలిగిన మంథని చరిత్రను కాపాడాలంటూ మేధావులకు లేఖలు రాస్తున్నట్లు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. బుధవారం మంథనిలోని రా జగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాత ముత్తాతల కాలం నుంచి మంథనికి ఒక చరిత్ర ఉందని, ఆ రో జుల్లోనే ఏది ఎక్కడ ఉండాలో ఆలోచన చేసి పొందుపర్చారన్నారు. చరిత్ర ఉన్న మున్సిపాలిటీని అక్కడి నుంచి తొలగించడం, సివిల్ ఆస్పత్రిని చెరువులో నిర్మించడం, జడ్జిల క్వార్టర్లను కూలగొట్టడం, ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌ను ఎక్కడో నిర్మించడంపై అసహానం వ్యక్తం చేశా రు. తమ హాయాంలో మంథని అభివృద్ధిలో ఎ వరికీ ఇబ్బంది పెట్టలేదని, రింగ్‌రోడ్డు నిర్మాణంలో ఒక్క ఇల్లు పోకుండా నిర్మించామన్నారు. మంథని మేధావులు స్పందించాలని కోరారు. బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రైతులకు అందుబాటులో యూరియా సబ్‌సెంటర్


