అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
పెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ పాలనలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎ మ్మెల్యే విజయమరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐదో వార్డులో మంగళవారం ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసి ఇళ్లకు భూ మిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నార. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. మున్సిపల్ మేనేజర్ లింగ య్య, నాయకులు నూగిల్ల మల్లయ్య, కొట్టె సదానందం, గుజ్జుల కుమార్, మహేందర్ ఉన్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
సమ్మక్క – సారలమ్మ భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయరమణా రావు సూచించారు. నీరుకుల్ల సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడా రు. తాగునీరు, మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు,ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయా లని అన్నారు. సర్పంచ్ సతీశ్, ఉత్సవ కమిటీ చైర్మన్ చంద్రయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, ఉప సర్పంచ్ సతీశ్, నాయకులు పాల్గొన్నారు.
మహిళలే మహరాణులు
పెద్దపల్లి: మహిళలను మహరాణులను చేయడమే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌లో వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతినిధులు అన్నయ్యగౌడ్, ప్రకాశ్‌రావు, శ్రీగిరి శ్రీనివాస్, బిరుదు సమత, అబ్బయ్యగౌడ్, ఊట్ల వరప్రసాద్, అంతటి పుష్పలత, రాజలింగం పాల్గొన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు


