ఆస్పత్రులపై విశ్వాసం పెంచాలి
పెద్దపల్లి: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు విశ్వాసం పెంచేలా పనితీరు ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహ ర్ష అన్నారు. గోదావరిఖని జనరల్ ఆస్పత్రి పనితీ రుపై కలెక్టరేట్‌లో మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. గోదావరిఖని జనరల్ ఆస్పత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదన్నారు. ఈవిషయంపై తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నా యని అన్నారు. ప్రతీ డిపార్ట్‌మెంట్‌లో వైద్యులు, సి బ్బంది సకాలంలో విధులకు హాజరుకావాలని ఆదేశించారు. అవుట్ పేషెంట్ సేవలు తగ్గే విభాగాలను గుర్తించి తరచూ సమీక్షించి లోటుపాట్లు సవరించుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.
పేషెంట్లతో మర్యాదగా వ్యహరించాలి
నర్సంగ్, పారామెడికల్, సెక్యూరిటీ సిబ్బంది పే షెంట్లు, వారి సహాయకులతో మర్యాదగా వ్యవహ రించాలని కలెక్టర్ ఆదేశించారు. మందుల కొరత స మస్య తలెత్తకుండా చూడాలన్నారు. మందుల స్టాక్ కోసం ప్రతిపాదనలు పంపించాలని పేర్కొన్నారు. జీజీహెచ్‌లోనే వైద్యపరీక్షలు నిర్వహించేందుకు పరికరాలు సమకూర్చుకోవాలని ఆదేశించారు. సిబ్బంది హాజరును బయోమెట్రిక్ విధానంలో నమోదు చేయాలని సూచించారు. డీఎంహెచ్‌వో వాణిశ్రీ,, ఆస్పత్రి సూపరింటెండెంట్ దయాళ్‌సింగ్, ఆర్‌ఎంవో కృష్ణబాయ్, డాక్టర్లు రాజు, అరుణ పాల్గొన్నారు.
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
పురపాలక ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఆదేశించారు. వి విధ జిల్లాల కలెక్టర్లతో కమిషనర్ వీడియో కాన్ఫరె న్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ హాజరయ్యారు. కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికలో షె డ్యూల్ విడుదల కాగానే ప్రవర్తనానియమావళి అ మలు, నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, ప రిశీలన, పోలింగ్, కౌటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలన్నారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ, జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, ఒక కా ర్పొరేషన్‌లో తుది ఓటరు జాబితా పూర్తిచేశామన్నా రు. ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


